Vizag: విశాఖలో 25 వేల మందికి ఉపాధి.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
సాగర నగరానికి కొత్త వెలుగులు రాబోతున్నాయి. ఈ నెల 29 విశాఖ రాబోతున్న ప్రధాని మోదీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
ఇప్పటికే అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈనెల 29న విశాఖలో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. ఏపీకి రానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లో ఒక దానికి పుడిమడకలో శంఖుస్థాపన చేయబోతున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. NTPC, AP GENCOల ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం కాబోతుంది. మూడు దశల్లో రాబోతున్న ప్రాజెక్ట్‌కు 84,700 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు జరగనున్నాయి.
గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయాని అన్నారు సీఎం చంద్రబాబు. ఇంటి దగ్గరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామన్న సీఎం చంద్రబాబు.. ఉత్పత్తి వ్యయం తగ్గించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కాన్సెప్ట్‌లో సోలార్ ప్యానెల్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు సీఎం. ఈమధ్యే రిలయన్స్ గ్రూప్, ఏపీ ప్రభుత్వంతో MOU కుదుర్చుకుందన్న సీఎం చంద్రబాబు రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించేలా 65 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రానికి GST బెనిఫిట్స్ వస్తాయన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..