Ap Weather Alert: నైరుతి రుపవనాలు తిరోగమనం.. ఈశాన్య ఋతుపవనాలు ఎంట్రీ ఎప్పుడంటే..
Ap Weather Alert: దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం పట్టాయి. తిరోగమన రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల ప్రాంతాల..

Ap Weather Alert: దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం పట్టాయి. తిరోగమన రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, నల్గొండ, బాగల్కోట్, వెంగూర్ల ప్రాంతాల గుండా కొనసాగుతుంది. అక్టోబర్ 23 తేదీన ఈశాన్య భారతదేశం లోని కొన్ని ప్రాంతాలు, మొత్తం ఉత్తర బంగాళాఖాతం ప్రాంతం, పశ్చిమ బెంగాల్ లోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా యొక్క మిగిలిన భాగాలు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మొత్తం గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు సహా మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతవరణ శాఖ అధికారులు చెప్పార. దీంతో 26 అక్టోబర్, 2021 న బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంల్లో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఇక అదే సమయంలో 26 అక్టోబర్, 2021న ఈశాన్య రుతుపవనాలు భారతదేశంలోని ఆగ్నేయ ద్వీపకల్పంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. దీంతో ఏపీలో వివిధ ప్రాంతాల్లో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది మరియు భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.
Also Read: రోజురోజుకీ వంటలక్కకి షాక్ ఇస్తున్న ప్రేక్షకులు.. రేసులో వస్తున్న కొత్త సీరియల్స్
