Satyavedu: ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిసోడ్‌లో రోజుకో ట్విస్ట్.. తెర వెనుక రాజీ ప్రయత్నాలు?

ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేగా, ఎన్నికల తరువాత తిరిగి గెలిచి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం అంతటా చర్చగా మారింది. పార్టీ మారి ఎన్నికల్లో రెండోసారి గెలిచిన మూడు నెలలు గడవక ముందే ఆ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ఆదిమూలం 50 ఏళ్ల పొలిటికల్ లైఫ్ కు లైంగిక దాడి కేసు మచ్చ పడింది.

Satyavedu: ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిసోడ్‌లో రోజుకో ట్విస్ట్.. తెర వెనుక రాజీ ప్రయత్నాలు?
Satyavedu MLA Koneti Adimulam
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 10, 2024 | 1:28 PM

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో రాజకీయ రచ్చగా మారింది. రోజుకో మలుపు తిరుగుతున్న కేసులో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రోజుకో ట్విస్ట్‌తో ఆసక్తి రేపుతోంది. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై ఇప్పటికీ కేసు నమోదు కాగా.. బాధితురాలికి వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల పోరు సత్యవేడులో కొనసాగుతోంది. లైంగిక దాడికి గురైన టిడిపి నాయకురాలికి భద్రత కల్పించిన పోలీసులు కేసు దర్యాప్తు ను వేగవంతం చేశారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం సత్యవేడుకు దూరంగా ఉండడంతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది.

ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేగా, ఎన్నికల తరువాత తిరిగి గెలిచి టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం అంతటా చర్చగా మారింది. పార్టీ మారి ఎన్నికల్లో రెండోసారి గెలిచిన మూడు నెలలు గడవక ముందే ఆ పార్టీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ఆదిమూలం 50 ఏళ్ల పొలిటికల్ లైఫ్ కు లైంగిక దాడి కేసు మచ్చ పడింది. సత్యవేడు మహిళా నేతపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆదిమూలం అశ్లీల వీడియోలతో అడ్డంగా బుక్కయ్యారు. టిడిపిలోని కొందరి కుట్రకు వైసీపీ వారి సహకారం అందిందంటున్న ఎమ్మెల్యే ఆదిమూలంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో నాలుగు రోజులుగా ఇదే రచ్చ తిరుపతి జిల్లాలో నడుస్తుంది. ఎమ్మెల్యే ఆదిమూలంకు అనుకూలంగా ఆయన అనుచరులు, దళిత సంఘాలు రోడ్డెక్కి మద్దతు తెలిపితే, టిడిపిలోని ఆదిమూలం వ్యతిరేకవర్గం మాత్రం నోరు మెదపని పరిస్థితి ఉంది. దీంతో సత్యవేడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసు చుట్టూ రాజకీయం నడుస్తుంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం పార్టీ మార్పును వ్యతిరేకించిన వర్గం ఈ కుట్రకు పాల్పడిందంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలంను ఆ పార్టీ సస్పెండ్ చేయగా ఆయనకు అండగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఇప్పుడు రోడ్డు ఎక్కింది. టిడిపిలో ఆదిమూలంకు అనుకూలంగా ఉన్న వర్గం వెనకుండి మద్దతుగా నిలిస్తే, వ్యతిరేక వర్గం మాత్రం కిమ్మనకుండా ఉంది.

మరోవైపు ఆదిమూలం కు 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన వైసీపీ ఈ వ్యవహారంపై సైలెన్స్ ను పాటిస్తోంది. స్థానిక టిడిపి కేడర్ నుంచి టికెట్ ఇవ్వొద్దని వ్యతిరేకత వచ్చినా టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలం ఆ పార్టీ కే చెందిన మహిళ లైంగిక దాడి కేసులో ఇరుక్కు పోయారు. టిడిపిలో ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే సస్పెన్షన్ కు గురి కావాల్సి వచ్చింది. సర్పంచ్ నుంచి రాజకీయాల్లో ఎదిగిన ఎమ్మెల్యే ఆదిమూలం సర్పంచ్ గా, వైస్ ఎంపీపీ గా జడ్పిటిసి గా రెండుసార్లు ఎమ్మెల్యేగా రాణించినా ఇప్పుడు సొంత పార్టీ మహిళా నాయకురాలిపై లైంగిక దాడి కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. తిరుపతిలోని ఒక హోటల్లో సాగిన ఆదిమూలం రాసలీలలు బయటకు రావడంతో ఆదిమూలంకు అజ్ఞాతం వీడని పరిస్థితి నెలకొంది.

టిడిపి హై కమాండ్ ఆగ్రహానికి గురై ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆదిమూలం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడంతో టిడిపిలో మరో వర్గానికి ఎలా స్పందించాలో తెలియని సంకట పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం ఇలా రాజకీయ రచ్చగా మారిపోగా ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా నేతకు పోలీసుల భద్రత కల్పించారు. కేవీబీ పురం మండలం కొత్తూరులో బాధిత మహిళ ఇంటి వద్ద కూడా పోలీసుల కాపలా కొనసాగుతుండగా స్థానిక మద్దతు లభించకపోవడం సమస్యగా మారింది. టిడిపిలోనూ ఆమెకు అండగా ఏ వర్గము నిలవలేక పొయింది. దీంతో సత్యవేడు టిడిపిలో ఏం జరుగుతోందన్న దానిపై పార్టీ హైకమాండ్ కూడా ఆరా తీస్తోంది. అసలు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారంలో కుట్ర జరిగిందా… ఆదిమూలంను ఇరికించే పని చేశారా… ఈ పని చేసిందెవరన్న దానిపై పార్టీలో, కేడర్ లో పెద్ద చర్చకే దారి తీసింది.

సత్యవేడులో పెత్తనం కోసం కొందరు, నామినేటెడ్ పదవుల కోసం మరికొందరు ఇలా టిడిపిలోని కొందరు నేతల ప్రయత్నమే ఈ కుట్రకు మూలమన్న ఆరు పనులు దళిత సంఘాలు పెద్ద ఎత్తున పిలిపిస్తున్నాయి. ఆదిమూలంకు మద్దతుగా నిలిచిన ఎస్సీ సంఘాలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి. ఎమ్మెల్యే ఆదిమూలం పై లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన కేసులో వాస్తవాలు తేల్చాలని కలెక్టర్ ను కలిసి విజ్ఞప్తి చేసాయి. పొలిటికల్ గా ఇరకాటంలో పెట్టడానికి ఈ కుట్ర జరిగిందని ఆరోపిస్తున్న దళిత సంఘాలు బాధితురాలికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసే ప్రయత్నంలో ఉన్నాయి.

మరో వైపు ఇప్పటికే ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేసేందుకు అవకాశం లేకపోతోంది. ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు జరిపిన హోటల్లో సిసి ఫుటేజ్ ను కూడా సేకరించి నిర్ధారించుకున్న పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆ రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యే ఆదిమూలమును విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బాధితురాలు మాత్రం ఇప్పటిదాకా వైద్య పరీక్షలకు సిద్ధం కాకపోవడంతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.

రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి కుట్ర జరిగిందంటున్న ఎమ్మెల్యే ఆదిమూలం మహిళను అడ్డుకుని మచ్చ వేశారంటున్నారు. తనపై నింద వేసిన ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే చెప్పడం, ఇప్పటికే జరిగిన నష్టం చాలని భావిస్తున్న బాధితురాలు మౌనంగా ఉండడం చూస్తే కేసు దర్యాప్తు ముందుకు కదలని పరిస్థితి ఉంది. ఇప్పటికే పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెబుతున్న ఆదిమూలం తీరు, అజ్ఞాతం వీడి ముందుకు రాని పరిస్థితి చూస్తే సత్యవేడు కేసు ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది.

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిషోడ్‌లో రోజుకో ట్విస్ట్..
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిషోడ్‌లో రోజుకో ట్విస్ట్..
విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు ఇక ఏడున్నర గంటలే..
విశాఖకు మరో వందేభారత్.. ఆ రెండు ప్రాంతాలకు ఇక ఏడున్నర గంటలే..
కంగనాకు ఏమైంది? ముంబైలోని కోట్ల విలువైన విల్లాను అమ్మేసింది
కంగనాకు ఏమైంది? ముంబైలోని కోట్ల విలువైన విల్లాను అమ్మేసింది
టైఫూన్ యాగీ విధ్వంసం అకస్మాత్తుగా విరిగిన ఉక్కు వంతెన వీడియోవైరల్
టైఫూన్ యాగీ విధ్వంసం అకస్మాత్తుగా విరిగిన ఉక్కు వంతెన వీడియోవైరల్
మీరూ పప్పును కుక్కర్‌లో వండుతున్నారా?
మీరూ పప్పును కుక్కర్‌లో వండుతున్నారా?
ఆ మందులపై GST 5 శాతానికి తగ్గింపు.. సమావేశంలో కీలక నిర్ణయం
ఆ మందులపై GST 5 శాతానికి తగ్గింపు.. సమావేశంలో కీలక నిర్ణయం
సినిమా చూస్తున్నంతసేపూ నవ్వులే నవ్వులు..
సినిమా చూస్తున్నంతసేపూ నవ్వులే నవ్వులు..
ఇలాంటివి పాక్‌లో చూస్తాం ఆదేశ ఆర్మీకి వ్యతిరేకంగా పోలీసులు నిరసన
ఇలాంటివి పాక్‌లో చూస్తాం ఆదేశ ఆర్మీకి వ్యతిరేకంగా పోలీసులు నిరసన
టీమిండియాలోకి సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు..! కేఎల్‌పై కీలక నిర్ణయం
టీమిండియాలోకి సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు..! కేఎల్‌పై కీలక నిర్ణయం
బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే
బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే