Ganesh Chaturthi: పండగ పూట రగడ.. మామిడాకుల కోసం వ్యక్తిపై కత్తితో దాడి!
పండగ పూట ఇళ్లంతా శుభ్రంగా కడిగి, తోరణాలు, పూలతో అలంకరించడం మన తెలుగోళ్లకు అలవాటు. అయితే తాజాగా జరిగిన వినియక చవితి పండగ నాడు తోరణాల కోసం ఓ వ్యక్తి మామిడి చెట్టు ఆకులు కోశాడు. దీంతో చెట్టు యజమని తనను అడగకుండా చెట్టు ఆకులు కోశాడని కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా యనమలలో గత శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి పండగ నాడు..
యనమల, సెప్టెంబర్ 10: పండగ పూట ఇళ్లంతా శుభ్రంగా కడిగి, తోరణాలు, పూలతో అలంకరించడం మన తెలుగోళ్లకు అలవాటు. అయితే తాజాగా జరిగిన వినియక చవితి పండగ నాడు తోరణాల కోసం ఓ వ్యక్తి మామిడి చెట్టు ఆకులు కోశాడు. దీంతో చెట్టు యజమని తనను అడగకుండా చెట్టు ఆకులు కోశాడని కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా యనమలలో గత శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి పండగ నాడు చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కృష్ణా జిల్లా యనమలకుదురులో వినియక చవితి పండగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం మిర్యాల అర్జునరావు (61) అనే వ్యక్తి గణేష్ చతుర్థిని పురస్కరించుకుని మామిడి ఆకుల కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఎవరినీ అడగకుండా చెట్టు ఆకులు కోశాడు. దీంతో ఆ ఇంటి యజమాని గెడ్డం నాంచారయ్య (36) అనే వ్యక్తి తమ అనుమతి లేకుండా ఇంటిలోని మామిడి ఆకులు ఎలా కోస్తావంటూ అర్జునరావుతో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాట మాట పెరిగింది. తీవ్ర కోపోధ్రిక్తుడైన నాంచారయ్య వంటగదిలోని కత్తి తీసుకువచ్చి అర్జునరావుపై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన అర్జునరావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలకు నో పర్మిషన్.. వెలసిన ఫ్లెక్సీలు, చుట్టూ ఇనుప కంచెలు
ప్రతీయేట గణేష్ చతుర్ధికి హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలు కోలాహలంగా జరుగుతాయి. అయితే ఈ యేడు మాత్రం అనుమతి లేదంటూ అక్కడ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్‌బండ్ మార్గంలో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలలో పేర్కొన్నారు. పైగా వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో వేయకుండా ట్యాంక్ బండ్ చుట్టూ ఇనుప కంచెలను కూడా వేశారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. సాగర్‌లో గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును నగర వాసులెవ్వరు పట్టించుకోకుండా ప్రతీయేట భారీ విగ్రహాలను ఇందులో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. దీంతో హైకోర్టు ఆదేశాలు అమలు కావట్లేదని లాయర్ వేణుమాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చారు.