Andhra Pradesh: మైనర్ బాలికను గర్భవతి చేసిన పాస్టర్.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు

గుంటూరు జిల్లా తుళ్లూరు మైనర్ బాలికపై లైంగికదాడికి పాడ్డ పాస్టర్‌ను దోషిగా తేల్చింది కోర్టు. బాలికను గర్భవతి చేసిన పాస్టర్ కు ఇరవై ఏళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి తీర్పు వెలువరించారు.

Andhra Pradesh: మైనర్ బాలికను గర్భవతి చేసిన పాస్టర్.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు
Verdict
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 10, 2024 | 2:46 PM

గుంటూరు జిల్లా తుళ్లూరు మైనర్ బాలికపై లైంగికదాడికి పాడ్డ పాస్టర్‌ను దోషిగా తేల్చింది కోర్టు. బాలికను గర్భవతి చేసిన పాస్టర్ కు ఇరవై ఏళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి తీర్పు వెలువరించారు. ఆరేళ్ల పాటు సాగిన విచారణలో తుది తీర్పు వెలువడింది.

తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన ఎన్.కోటేశ్వరరావు (55)చర్చిలో పాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో చర్చికి వచ్చిన 15 ఏళ్ల మైనర్ బాలిక పట్ల పాస్టర్ కోటేశ్వరరావు అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు ఆమెను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన ఘటనను ఎవరికి చెప్పులేకోలేకపోయిన బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతిగా నిర్ధారించారు. బాలికను ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.

దీంతో తల్లిదండ్రులు పాస్టర్ పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ సీహెచ్.రవిబాబు కేసు దర్యాప్తు చేపట్టి, పాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఆరేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఐదో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శిక్ష విధించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..