Andhra Pradesh: ఆరిఫ్ ఇది కరెక్ట్ కాదు.. ప్రాంక్‌ల పేరుతో పైత్యం.. డీజీపీకి ఫిర్యాదులు

ప్రాంకులు హద్దు మీరుతున్నాయి. జనాన్ని భయపెట్టి నాలుగు కాసులు పొంది.. ఫేమస్ అయ్యేందుకు యత్నిస్తున్నారు కొందరు. అవతలి వాళ్లను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనీసం పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు.

Andhra Pradesh: ఆరిఫ్ ఇది కరెక్ట్ కాదు.. ప్రాంక్‌ల పేరుతో పైత్యం.. డీజీపీకి ఫిర్యాదులు
Prank On Children
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 03, 2023 | 2:45 PM

రోజూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి యూట్యూబ్ ఛానెళ్లు. సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించేందుకు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. ఆ మాయదారుల్లో ప్రాంక్ వీడియోలదే సింహ భాగం. ఒకప్పుడు చిన్నచిన్న సర్‌ప్రైజుల్లా మొదలైన ప్రాంక్ వీడియోలు… ఆ తర్వాత జడలు విప్పుకున్నాయి. రెండర్థాల మాటలతో, పచ్చిపచ్చి బూతులతో రెచ్చిపోయి… విపరీత పనులతో ప్రజలను భయకంపితులను చేస్తూ.. వీడియోలు చేసి నెటిజనం మీదికి వదిలెయ్యడం ఒక లాభసాటి మార్గంగా మారిపోయిందిప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వీడియోలు చేసేవాళ్లు పదుల సంఖ్యలోనే ఉన్నారు.

ప్రాంక్ వీడియోలతో సభ్య సమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నామనే ధ్యాసే లేకుండా పోయింది వాటి మేకింగ్‌ మారాజులకు. అప్‌లోడ్ చేసీ చెయ్యగానే లైక్స్‌ అండ్ వ్యూస్ అమాంతం పెరిగి… రెవిన్యూ వచ్చి అకౌంట్లలో పడిపోతే చాలు. అలా వచ్చిన డబ్బులతో ఇంకాస్త పైత్యం కలిపి… ఇంకొన్ని వీడియోలు చేసుకోవడమే వాళ్లక్కావల్సింది.

తాజాగా అరీప్‌ అనే వ్యక్తి ఫ్రాంక్‌ వీడియోలతో పిల్లలను, పెద్దలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. లిఫ్ట్ ఇస్తున్నట్లుగా వారిని కారులో ఎక్కించుకుని.. కిడ్నాప్ చేస్తామంటూ, కిడ్నిలు తీసుకుంటామంటూ, నరబలి ఇస్తామంటూ, చేతబడి చేస్తామంటూ ఇలా రకరకాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కొందరు అయితే అతడి కారులోనుంచి దూకే యత్నం కూడా చేశారు.

దీంతో ఇతనిపై చర్య తీసుకోవాలని ట్విట్టర్‌లో డీజీపికి  ఫిర్యాదు చేశారు. ఇలాంటివి పిల్లలపై చేయడం వల్ల వాళ్ల మానసిక స్థితి దెబ్బతింటోందని.. భయబ్రాంతులకు గురవుతున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇతని యూట్యూబ్‌ చానల్‌ నిండా ఇలాంటి ప్రాంక్ వీడియోలే ఉన్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..