AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: రైల్వే స్టేషన్‌లో ముగ్గురు మహిళల వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ డాగ్.. ఏంటా అని తనిఖీ చేయగా

అది విజయవాడ రైల్వే స్టేషన్. ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంది. పోలీసులను రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో చెకింగ్స్ సమయంలో సాయపడే డాగ్ ఒకటి.. మూడు బ్యాగుల వద్దకు వెళ్లి ఆగింది. దాన్ని చూడగానే వాటిని తీసుకొచ్చిన మహిళలు.. అక్కడి నుంచి వెళ్లిపోడానికి యత్నించారు.

Vijayawada: రైల్వే స్టేషన్‌లో ముగ్గురు మహిళల వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ డాగ్.. ఏంటా అని తనిఖీ చేయగా
Vijayawada Railway Station
Vasanth Kollimarla
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 05, 2025 | 5:09 PM

Share

ప్రయాణికుల మాటున గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను విజయవాడ రైల్వే స్టేషన్‌లో నార్కో డాగ్ ‘లియో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. 30 కిలోల గంజాయిని ముగ్గురు మహిళల నుంచి స్వాధీనం చేసుకుని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఏపీలో గంజాయిపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి తెస్తున్న గంజాయిని సీజ్ చేసి అరెస్టులు చేస్తూ ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు, ఈగల్ టీం. అయితే ఇటీవల జాతీయ రహదారిపై నిఘా పెరగడం ఏ వాహనాన్ని వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉండటంతో గంజాయి స్మగ్లర్లు కొత్తదారిని ఎంచుకున్నారు. అందుకోసం రైళ్లను ఎంచుకొని ఎవరికి అనుమానం రాకుండా రాష్ట్రాల సరిహద్దులు దాటించేస్తున్నారు. అయితే ఇటీవల రైళ్లలో గంజాయి , గంజాయి చాక్లెట్లు తరలిస్తున్నారని ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో నిఘా పెట్టి గంజాయి, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకొని సీజ్ చేసి అరెస్టులు చేస్తున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి మహిళలను స్మగ్లర్లుగా వాడుకుంటున్న తరుణంలో ఇటీవల గంజాయి రవాణాను అడ్డుకోవడం అడ్డంకిగా మారింది. దీనితో స్మగ్లర్ల ఎత్తును చిత్తు చేసేలా డ్రగ్స్ రవాణాను ఇట్టే పసిగట్టగలిగే డాగ్‌ను రంగంలోకి దింపారు పోలీసులు. దీంతో ఇట్టే దొరికిపోయారు గంజాయి సరఫరా చేస్తున్న మహిళలు.

Ganja Caught

RPF డాగ్ స్క్వాడ్‌కు చెందిన నార్కో డాగ్ లియో విజయవాడ రైల్వే స్టేషన్‌లో 30 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. క్రైమ్ ఇంటెలిజెన్స్, రైల్వే డాగ్ స్క్వాడ్, GRP విజయవాడ సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో డ్రగ్స్ ను గుర్తించడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నార్కో డాగ్ లియో ముగ్గురు మహిళా ప్రయాణికుల దగ్గర ఉన్న మూడు అనుమానాస్పద బ్యాగులను గుర్తించి పోలీసులను హెచ్చరించింది. దీనితో ఆ బ్యాగులను వదిలి దూరంగా వెళ్తున్న ప్రయాణికులను సైతం గుర్తించి పోలీసులను అలర్ట్ చేసింది.  ఆ బ్యాగ్స్‌లో 30 కేజీలు బరువున్న 7 పొడి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని సుశాంతి, మనీషా, పుష్పలతను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో గంజాయిని అమ్మాలనే ఉద్దేశంతో ఒడిశాలోని నబరంగ్‌పూర్ నుంచి ప్రయాణించి విశాఖపట్నంలో రైలు ఎక్కారని విచారణలో తేలింది. విశాఖపట్నంలో బోలా అనే వ్యక్తి గంజాయిని ముగ్గురు మహిళలకు అప్పగించారు. విశాఖ నుంచి చెన్నై బయల్దేరిన ముగ్గురు మహిళలను లియో గుర్తించడంతో ముగ్గురు మహిళలను కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.

Dog Leo

Dog Leo

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..