TDP Vs YCP: పాణ్యంలో పొలిటికల్ హీట్‌.. కాటసాని అవినీతిపై చర్చకు లోకేశ్‌ సవాల్‌… డేట్‌, టైమ్‌ ఫిక్స్‌ చేయాలన్న కాటసాని

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రతో ఏపీని చుట్టేస్తున్నారు.

Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 07, 2023 | 4:17 PM

ఏపీలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. నారా లోకేశ్ యువగళం యాత్రతో.. వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. ఆరోపణలు, విమర్శలు, సవాళ్లతో మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. తాజాగా.. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నారా లోకేశ్ మధ్య సవాళ్ల పర్వం పీక్‌ స్టేజ్‌కు చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రతో ఏపీని చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు నారా లోకేశ్‌. అయితే.. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై లోకేశ్‌ అవినీతి, భూకబ్జా ఆరోపణలు చేయడంతో పాలిటిక్స్‌ మరింత హీటెక్కాయి. కాటసాని ముస్లింలకు చెందిన 100 కోట్ల భూములు కొట్టేశారని నారా లోకేశ్‌ ఆరోపించారు. పాణ్యం నియోజవర్గంలోని అవినీతిపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే కాటసానికి లోకేశ్‌ సవాల్‌ విసిరారు.

ఇక.. టీవీ9 వేదికగా నారా లోకేశ్ సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి. తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని లోకేశ్‌కి ప్రతి సవాల్ విసిరారు. నీ టెంటు దగ్గరా?.. మా ఇంటి దగ్గరా?.. ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు. చర్చకు లోకేశే డేట్, టైమ్ ఫిక్స్‌ చేయాలన్న కాటసాని కామెంట్స్‌ కాక రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మొత్తంగా.. లోకేశ్‌ పాదయాత్ర కర్నూలు జిల్లాలో రాజకీయంగా హీట్‌ పుట్టిస్తోంది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని, నారాలోకేశ్‌ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అయితే.. కాటసాని ప్రతిసవాల్‌పై నారా లోకేష్‌ రియాక్ట్‌ అయ్యారు. కాటసాని అవినీతిపై సర్వే నెంబర్లతో ఆధారాలు విడుదల చేశారు లోకేష్‌. లోకేశ్‌ ఎవిడెన్స్‌లు కూడా రిలీజ్‌ చేయడంతో మళ్లీ కాటసాని ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..