Yuva Galam: బ్యాడ్ మార్నింగ్ టూ ఎమ్మెల్యే కేతిరెడ్డి… నారా లోకేశ్ ర్యాగింగ్
యువగళం పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యేలపై పంచ్‌లు పేలుస్తున్నారు లోకేశ్. తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ సర్వే నంబర్లతో సహా కొన్ని వివరాలు వెల్లడించారు లోకేశ్. ఆ డీటేల్స్ చూద్దాం పదండి.

గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గుట్ట చెరువులు ఆక్రమించి చేసిన కబ్జాలు చూపించాను. ఆదివారం ఉదయం చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా ఇది ఆయన కొన్ని ఫోటోలు విడుదల చేశారు. జనాల్ని ఏమార్చేందుకు గుడ్ మార్నింగ్ డ్రామా, మూడు పూట్లా చేసేవి కబ్జాలు-దందాలు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు లోకేశ్. డ్రామాలన్నీ బట్టబయలయ్యాయని.. బ్యాడ్ మార్నింగ్ టూ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంటూ పేర్కొన్నారు లోకేశ్.
కేతిరెడ్డి నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారని.. తాను మాత్రం గుట్టలను దోచేస్తాడని ఫైరయ్యారు లోకేశ్. కేతిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి లగ్జరీ ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో.. ఎర్రగుట్టపై 15 ఎకరాల ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దొంగ పత్రాలు సృష్టించి కాజేశారని లోకేశ్ విమర్శించారు. 15 ఎకరాల భూమి మాత్రమే కాకుండా మరో 5ఎకరాల భూమిని కేతిరెడ్డి.. తన కుటుంబంలోని ఓ మహిళ పేరుతో నమోదు చేసినట్లు వివరించారు. లోకేశ్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలో కంప్లీట్ చేసుకుని ధర్మవరం నియోజకవర్గంలోకి శనివారం ప్రవేశించించిన సంగతి తెలిసిందే. ఆయనకు క్యాడర్ ఘనస్వాగతం పలికింది.
ఆదివారం ఉదయం 58వ రోజు పాదయాత్ర పారంభించారు లోకేశ్. ధర్మవరంలో చేనేత కార్మికులతో మాట్లాడారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. పట్టు పరిశ్రమ రైతులకు రాయితీలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. పట్టు వస్త్రాలపై జీఎస్‌టీ లేకుండా చేస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
