వైసీపీ దాడులు..ఇక ఉపేక్షించేది లేదుః నారా లోకేష్‌

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్..గుంటూరులో ఏర్పాటు చేసిన వైసీపీ బాధితులకు టీడీపీ కల్పించిన రక్షణ శిబిరాన్ని లోకేష్‌ సందర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  వైసీపీ అరాచకాలు, టీడీపీ నేతలు, సానుభూతిపరులపై దాడులతో వంద రోజులు ఓపికపట్టామని.. ఇక సహించేది లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. టీడీపీకి ఓటు […]

వైసీపీ దాడులు..ఇక ఉపేక్షించేది లేదుః నారా లోకేష్‌
Follow us

|

Updated on: Sep 06, 2019 | 4:49 PM

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్..గుంటూరులో ఏర్పాటు చేసిన వైసీపీ బాధితులకు టీడీపీ కల్పించిన రక్షణ శిబిరాన్ని లోకేష్‌ సందర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  వైసీపీ అరాచకాలు, టీడీపీ నేతలు, సానుభూతిపరులపై దాడులతో వంద రోజులు ఓపికపట్టామని.. ఇక సహించేది లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. టీడీపీకి ఓటు వేసిన ప్రతిఒక్కరిని ఏదో ఒక చోట ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు అన్నీ సహించామని.. ఇక ఓపిక పట్టేదేలేదని హెచ్చరించారు.  వైసీపీ వర్గాలు చేస్తున్న దాడులను పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇకపై ఎవరిని ఇబ్బందులు పెట్టినా బాధితులకు అండగా ఉంటామన్న లోకేష్ వైసీపీ దాడుల వలన నష్టపోయిన సానుభూతిపరులకు పదివేలు తక్షణ సాయంతో పాటు పిల్లలకు ఉన్నత విద్య అందిస్తామన్నారు. పిన్నెల్లిలో దాదాపు 200 మందిపై ఒక్కొక్కరిపై నాలుగు అక్రమ కేసులు పెట్టారని, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలొస్తున్నాయని, గ్రామాల నుండి వెళ్లినవారిని ఈనెల 11 నాటికి తిరిగి గ్రామాలలోకి తీసుకువచ్చి రక్షణ కల్పించాలన్నారు.