మత్స్య పరిశ్రమలో ఏపీ ముందంజః కేంద్రమంత్రి గిరిరాజ్‌

మత్స్య పరిశ్రమలో ఏపీ ముందంజః కేంద్రమంత్రి గిరిరాజ్‌

మత్స్య పరిశ్రమలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందన్నారు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌. శుక్రవారం ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని భోగాపురం మండలం బోయపాలేంలోని వైసాఖీ బయో రిసోర్సెస్ ను సందర్శించిన గిరిరాజ్ సింగ్ రొయ్య పిల్లల ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 47 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీనిని లక్ష […]

Pardhasaradhi Peri

|

Sep 06, 2019 | 4:18 PM

మత్స్య పరిశ్రమలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందన్నారు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌. శుక్రవారం ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని భోగాపురం మండలం బోయపాలేంలోని వైసాఖీ బయో రిసోర్సెస్ ను సందర్శించిన గిరిరాజ్ సింగ్ రొయ్య పిల్లల ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..దేశంలో మత్స్య పరిశ్రమ ద్వారా ప్రస్తుతం 47 వేల కోట్ల ఎగుమతులు జరుగుతున్నాయనీ, దీనిని లక్ష కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. అందుకోసం 25 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. మత్స్య పరిశ్రమలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందంటూ, ఈ ఉత్పత్తుల్లో రసాయనాల వాడకం తగ్గించాలని సూచించారు. రాష్ట్రంలో సగటు రొయ్యల ఉత్పత్తి హెక్టారుకు మూడు టన్నులు కాగా, దీనిని 9 టన్నులకు పెంచాలని నిర్దేశించారు. రొయ్యలకు సర్టిఫికేషన్‌ కోసం చెన్నై వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలనే దృష్టితోనే వ్యవసాయ శాఖ నుంచి విడదీసి పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలను వేరే శాఖగా ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్ ఏ బడుకొండ అప్పల నాయుడు కలిశారు. కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బాలాజీ, మత్స్య శాఖ కమిషనర్ రాం శంకర్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu