AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuppam Politics: కుప్పంలో మున్సిపల్ వార్.. క్లీన్ స్వీప్ టార్గెట్‌గా వైసీపీ వ్యూహం.. పరువు కోసం టీడీపీ పాకులాట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలో అగ్నిపరీక్షగా మారింది. ఇజ్జత్‌ కా సవాల్. మున్సిపల్ వార్‌లో డూ ఆర్ డై సిట్యుయేషన్.

Kuppam Politics: కుప్పంలో మున్సిపల్ వార్.. క్లీన్ స్వీప్ టార్గెట్‌గా వైసీపీ వ్యూహం.. పరువు కోసం టీడీపీ పాకులాట
Chandrababu Vs Peddireddy
Balaraju Goud
|

Updated on: Nov 04, 2021 | 11:34 AM

Share

Municipal Election political heat in Kuppam: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలో అగ్నిపరీక్షగా మారింది. ఇజ్జత్‌ కా సవాల్. మున్సిపల్ వార్‌లో డూ ఆర్ డై సిట్యుయేషన్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై చంద్రబాబుని ఒంటరిగా నిలపింది. మళ్లీ ఇప్పుడు మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. మరి మున్సిపల్ ఎన్నికల్లోనైనా సైకిల్ సత్తా చాటుతుందా? లేక మళ్లీ ఫ్యాన్‌ హవానే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది.

చిత్తూరు జిల్లా కుప్పంలో మున్సిపల్ వార్ ఓ రేంజ్‌లో ఉంటుందనేది స్పష్టమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో ఓటమి రుచి చూపించాలని వైసీపీ ఉవ్వీళ్లూరుతోంది. అటు కనీసం ఈ ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్‌లోకి దింపారు మంత్రి పెద్దిరెడ్డి. ఇప్పుడు పరిస్థితి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లుగా మారింది. నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయ్యాక కుప్పంలోనే మకాం వేయాలని మంత్రి పెద్దిరెడ్డి భావిస్తున్నారు. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీ లోనూ క్లీన్ స్వీప్ చేయాలన్నది ఆయన టార్గెట్. మరోవైపు YCP దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుని కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది.

ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దండయాత్ర చేసింది. చాలా చోట్ల టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఈ దెబ్బతో ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిందా అన్నపరిస్థితిలోకి వెళ్లిపోయింది తెలుగుదేశం పార్టీకి. ఘోర పరాజయంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆత్మస్థైర్యం దెబ్బతింది. దీంతో ఈ మధ్యే కుప్పంలో పర్యటించారు చంద్రబాబు. రోడ్‌షో ద్వారా బలప్రదర్శన చేశారు. టీడీపీ బలం తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. అటు వైసీపీ కూడా ఇప్పటికే ప్లానింగ్ మొదలు పెట్టింది. పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేసింది. సీనియర్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు.. సో కుప్పంలో ఇప్పటికే హైవోల్టేజ్‌ క్రియేట్ అయింది.

Read Also….  AP CM Jagan: ఈ నెల 9న ఒడిశా పయనంకానున్న సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!