చనిపోయే స్టేజిలో ఉన్న ఎమ్మెల్యేను కాపాడుకుంటే చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారు: మంత్రి రోజా షాకింగ్‌ కామెంట్స్‌

సింహపురిలో రాజకీయసవాళ్లు కొనసాగుతున్నాయి.. గెలిచేది నేనే అంటూ రెబల్‌ మీసం మేలేస్తుంటే... ఎలా గెలుస్తారో చూస్తాం అదే జరిగితే రాజకీయాలే వదిలేస్తామంటున్నారు మాజీ మంత్రి. ఇక ఆ నలుగురే కాదు 40 మంది టచ్‌లో ఉన్నారని తెలుగుదేశం అంటోంది. ఇక చనిపోయే స్టేజిలో ఉన్న ఎమ్మెల్యేను

చనిపోయే స్టేజిలో ఉన్న ఎమ్మెల్యేను కాపాడుకుంటే చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారు: మంత్రి రోజా షాకింగ్‌ కామెంట్స్‌
Minister Roja
Follow us

|

Updated on: Mar 28, 2023 | 9:03 PM

సింహపురిలో రాజకీయసవాళ్లు కొనసాగుతున్నాయి.. గెలిచేది నేనే అంటూ రెబల్‌ మీసం మేలేస్తుంటే… ఎలా గెలుస్తారో చూస్తాం అదే జరిగితే రాజకీయాలే వదిలేస్తామంటున్నారు మాజీ మంత్రి. ఇక ఆ నలుగురే కాదు 40 మంది టచ్‌లో ఉన్నారని తెలుగుదేశం అంటోంది. ఇక చనిపోయే స్టేజిలో ఉన్న ఎమ్మెల్యేను కాపాడుకుంటే చివరకు టీడీపీతో కలిసి వెన్నుపోటు పొడిచారంటూ మంత్రి రోజా తన మార్క్‌ కామెంట్లతో విరుచుకుపడ్డారు. బెంగళూరు నుంచి ఉదయగిరికి చేరుకున్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అధికారపార్టీని టార్గెట్‌ చేశారు. జనంలో ఉంటా.. జనం నాతో ఉంటారంటున్న మేకపాటి సజ్జలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్ర జరుగుతుందన్న మేకపాటి జిల్లాలోనే ఉంటానంటున్నారు. తనకు టికెట్ ఇవ్వనని చెప్పారని, అందుకే బాధపడ్డానన్న మేకపాటి వచ్చే ఎన్నికల్లో గెలిచేది తానే అంటూ మీసం తిప్పి మరీ సవాల్‌ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురిలో ఏ ఒక్కరు మళ్లీ అసెంబ్లీకి వచ్చినా నెల్లూరు జిల్లాలో కూడా అడుగుపెట్టనంటున్నారు మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. రాజకీయాలు వదిలేసి వెళ్లిపోవడం కాదు జిల్లాలోనే అడుగు పెట్టబోనని.. ఈ ఓపెన్‌ ఛాలెంజ్‌ స్వీకరించే దమ్ముందా అంటూ సవాల్‌ విసిరారు మాజీమంత్రి.

అటు సింహపురిలో సవాళ్లు కోనసాగుతుండగానే.. మరో మంత్రి రోజా కూడా రెబల్స్‌పై ఓ రేంజిలో విమర్శలు గుప్పించారు. కోవిడ్ సోకి చావుబతుకుల మధ్య ఉన్న ఎమ్మెల్యే శ్రీదేవిని కాపాడిన సీఎం జగన్‌పై నిందలు వేయడాన్ని తప్పుబట్టారు రోజా. సస్పెండ్‌ అయిన నలుగురే కాదు.. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు. ఫోన్లు చేసి మరీ వస్తామంటున్నారని.. పార్టీలో చర్చించిన తర్వాతే చేరికలపై నిర్ణయం ఉంటుందన్నారు ఏపీ టీడీపీ చీఫ్‌.మొత్తానికి ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోటా ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో సమీకరణాలే మారిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు