- Telugu News Photo Gallery According to latest report secunderabad to tirupati vande bharat express starts from april 8th
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌కు ముహుర్తం ఖరారు.. రైలు వెళ్లే రూట్ ఇదే.
తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ రైలుకు కూత పెట్టడానికి సిద్ధమవుతోంది. సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ రైలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది..
Updated on: Mar 28, 2023 | 8:24 PM

శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు.

Vande Bharat

ప్రస్తుతం వీటిపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందేభారత్ రైలును వయా నల్గొండ, బీబీనగర్, గుంటూరు మీదుగా నడపనున్నారని తెలుస్తోంది. మొదటి వందేభారత్ ట్రైన్(సికింద్రాబాద్ టూ వైజాగ్) విజయవాడ మీదుగా వరంగల్, ఖమ్మంలను కలుపుతూ వెళ్తుండటంతో.. రెండో రైలును మిర్యాలగూడ, నల్గొండ, గుంటూరు ప్రయాణికులకు కనెక్టివిటీని అందించాలని రైల్వేశాఖ భావిస్తోంది.

ప్రస్తుతం, సికింద్రాబాద్ – త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి – తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా తిరుపతికి పరుగులు పెడుతున్నాయి. వీటి ప్రయాణ సమయంలో దాదాపు 12 గంటలు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాన్ని 8 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్‌కు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టాప్‌లుగా ఉండే అవకాశం ఉంది. కాగా, వందేభారత్ రైలు రూట్‌పై క్లారిటీ వచ్చిన తర్వాతే.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
