AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhimavaram: వివాహితపై బాలుడి అత్యాచారం.. ఆమె బహిర్భూమికి వెళ్లగా

భీమవరం మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్‌ రైటర్‌ మహేశ్వరరావు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి...

Bhimavaram: వివాహితపై బాలుడి అత్యాచారం.. ఆమె బహిర్భూమికి వెళ్లగా
Bhimavaram
Ram Naramaneni
|

Updated on: Feb 01, 2024 | 9:01 AM

Share

ఫిబ్రవరి 1: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన మహిళపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లగా బాలుడు.. ఆమెను సైలెంట్‌గా ఫాలో అయ్యాడు. ఆపై బెదిరించి అఘాయిత్యం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పాత బాల నేరస్థుడని తెలిపారు.

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ చెక్‌ పోస్ట్‌ దగ్గర సీపీ ఆకస్మిక తనిఖీలు

— హైదరాబాద్ నగరంలో వరుస హిట్ అండ్ రన్ ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగు రోజల క్రితం ఘటన మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఘటనలో బౌన్సర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి జరిగిన జూబ్లీహిల్స్‌లో 2 బైక్‌లను ఢీకొట్టింది కారు. అన్నాచెల్లితో పాటు మరో వాహనదారునికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

— వైట్‌ కలర్‌ స్పోర్ట్స్‌ కారు ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. వరుస హిట్ &రన్‌ కేసులతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ మధ్య పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌, హయత్‌నగర్‌లో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి.

మరిన్ని తాజా వార్తలు ఇక్కడ చదవండి