AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradseh: న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి.. మంత్రి సురేశ్

రేపల్లె(Repalle) ఘటన బాధితురాలికి న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడుల విషయంలో రాజకీయాలు చేయకూడకదని...

Andhra Pradseh: న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి.. మంత్రి సురేశ్
Adimulapu Suresh
Ganesh Mudavath
|

Updated on: May 02, 2022 | 3:44 PM

Share

రేపల్లె(Repalle) ఘటన బాధితురాలికి న్యాయం చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దాడుల విషయంలో రాజకీయాలు చేయకూడకదని సూచించారు. ప్రభుత్వపరంగా బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు. బాధితురాలు యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో స్థానిక నేతలు ఒంగోలు(Ongole) రిమ్స్ కు తరలించారని వివరించారు. రాష్ట్రాన్ని బీహార్ తో పోలుస్తూ ప్రతిపక్షాలు దారుణంగా కామెంట్స్ చేస్తున్నాయని, ఒంగోలు రిమ్స్ లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. మరోవైపు.. రేపల్లె ఘటన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. రేపల్లె, గుంతకల్లు రైల్వే స్టేషన్ లో జరిగిన అత్యాచార కేసులపై రైల్వే అధికారులతో మాట్లాడామన్న ఆమె.. సెక్యూరిటీ పరంగా మహిళల కోసం ఏం చేస్తున్నారనే దానిపై చర్చించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ లలో మహిళల భద్రత విషయంపై రైల్వేశాఖకు లేఖ రాసినట్లు చెప్పారు.

గుంటూరు జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. అవనిగడ్డలో పని చేసేందుకు రేపల్లే రైల్వేస్టేషన్‌కు చేరుకున్న దంపతులిద్దరూ.. అవనిగడ్డ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో స్టేషన్‌లోని బెంచ్ పై పడుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు నిద్రిస్తున్న మహిళను పక్కకు లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన భర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూసే సరికి.. ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

JC Prbhakar Reddy: “కేటీఆర్ మాటలు వాస్తవమే.. కావాలంటే నిరూపిస్తా”.. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్

Study Tips: చదివేటప్పుడు సంగీతం వినడం మంచిదా.. చెడ్డదా.. వాస్తవం తెలుసుకోండి..!