Sankranti: సంక్రాంతి సంబరాల్లో అలీతో జాలీగా మంత్రి రోజా.. చిలక జోస్యం చెప్పించుకున్న సినీ నటుడు

Surya Kala

Surya Kala | Edited By: Janardhan Veluru

Updated on: Jan 17, 2023 | 5:49 PM

అలీతో కలిసి రోజా జాలీగా ఎడ్లబండిని తోలుతూ సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా పొంగళ్లు పెట్టారు. తోటి మహిళలకు గాజులు తొడిగి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Sankranti: సంక్రాంతి సంబరాల్లో అలీతో జాలీగా మంత్రి రోజా.. చిలక జోస్యం చెప్పించుకున్న సినీ నటుడు
Nagari Sankranti Celebrations

ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించారు. సంబరాలు జరిగిన నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణానికి మంత్రి రోజా..వైసిపీ నేత సినీ నటుడు అలీతో కలిసి ఎద్దుల బండిపై వచ్చారు. ఈ సందర్బంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలీతో కలిసి రోజా జాలీగా ఎడ్లబండిని తోలుతూ సందడి చేశారు. సంక్రాంతి సందర్భంగా పొంగళ్లు పెట్టారు. తోటి మహిళలకు గాజులు తొడిగి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబరాల్లో పాల్గొన్న సినీ నటుడు అలీ చిలుకజోస్యం చెప్పించుకున్నారు. చిలుక జ్యోతిష్యుడు అలీకి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. మరోవైపు మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పండగ ముఖ్యమైనదని అన్నారు. ఈ సంబరాలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు వచ్చారు.

అలీతో కలిసి చిలుక జోస్యం చెప్పించుకున్న మంత్రి రోజా..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu