Jallikattu in AP: రంగంపేటలో కలర్‌ఫుల్‌గా జల్లికట్టు.. పోటీలు నిర్వహించినవారిపై కేసునమోదు చేస్తామంటున్న పోలీసులు

పోలీసుల ఆంక్షల మధ్యే జల్లికట్టు పోటీలు నిర్వహించారు. నిర్వహణపై పోలీసులు మొదటినుంచి ఆంక్షలు విధిస్తూ వచ్చారు. కానీ అవేవీ నిర్వాహకులు పట్టించుకోలేదు. ఎప్పట్లాగే జల్లికట్టు పోటీలు నిర్వహించారు.

Jallikattu in AP: రంగంపేటలో కలర్‌ఫుల్‌గా జల్లికట్టు.. పోటీలు నిర్వహించినవారిపై కేసునమోదు చేస్తామంటున్న పోలీసులు
Jallikattu
Follow us

|

Updated on: Jan 17, 2023 | 10:08 AM

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వేడుకలు అంగ రంగ వైభవంగా సాగాయి. భోగి, సంక్రాంతి , కనుమతో పాటు నేడు ముక్కనుమను కూడా కొన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. సాంప్రదాయ పోటీలైన కోడి పందాలు, జల్లి కట్టు పోటీలు సందడిగా సాగాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో జల్లికట్టు పోటీలు కలర్‌ఫుల్‌గా సాగాయి. సినీ, రాజకీయ ఫోటోలతో గిత్తలను అందంగా అలంకరించారు. రంకెలు వేస్తూ పరిగెత్తతున్న గిత్తలను పట్టుకునే ప్రయత్నంలో కొంత మంది యువకులు గాయపడ్డారు. పోటీలు ముగిశాక ఓ ఎద్దు జనం మీద పడింది. దాని వీరంగం ధాటికి అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు.

పోలీసుల ఆంక్షల మధ్యే జల్లికట్టు పోటీలు నిర్వహించారు. నిర్వహణపై పోలీసులు మొదటినుంచి ఆంక్షలు విధిస్తూ వచ్చారు. కానీ అవేవీ నిర్వాహకులు పట్టించుకోలేదు. ఎప్పట్లాగే జల్లికట్టు పోటీలు నిర్వహించారు. హెచ్చరికలు ఖాతరు చేయకుండా పోటీలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.,,