AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: భర్త కంటే భార్య పెద్దదైతే.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవన్న చాణక్య ..ఏవి ఏమిటో తెలుసుకోండి.

భార్యాభర్తల మధ్య సంబంధాలకు సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొన్నాడు. చాణక్య విధానం ప్రకారం, భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం వారి వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వైవాహిక జీవితానికి సంబంధించి చాణక్యుడు సూచించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి.

Chanakya Niti: భర్త కంటే భార్య పెద్దదైతే.. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవన్న చాణక్య ..ఏవి ఏమిటో తెలుసుకోండి.
విజయం సాధించాలనే అహంకారం లేదా తన దగ్గర డబ్బు ఎక్కువ అనే అహంభావం ఉన్న వారి వద్ద లక్ష్మీదేవి ఉండదు. చాణక్యుడి ప్రకారం డబ్బు ఉందనే అహంకారం మీలో ఉంటే.. మీ తెలివితేటలు భ్రష్టు పట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. డబ్బు తెచ్చిన అహంకారంతో ఉన్నవారు ఆ డబ్బుని పోగొట్టుకుని పేదవారు కావచ్చు.
Surya Kala
|

Updated on: Jan 17, 2023 | 7:17 AM

Share

ఆచార్య చాణక్యుడి సూక్తులు నేటికి అనుసరణీయం. అప్పటి కాలంలో చెప్పినా నేటి ఆధునిక కాలంలో కూడా మనిషి జీవన విధానానికి అనుసరనీయంగా నిలుస్తున్నాయి. చాణక్యుడు చెప్పిన మాటలు అతని చాణక్య నీతి పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి . ఈ విధానాలను చదవడం ద్వారా అనేక విషయాలను నేర్చుకుంటాము. ఆచార్య విధానాలను అవలంబించడం ద్వారా.. /ఒక సాధారణ బాలుడు చక్రవర్తి అయ్యాడు చంద్రగుప్త మౌర్యగా ప్రసిద్ధిగాంచాడు. చాణక్యుడు తన పుస్తకంలో భార్యాభర్తల మధ్య సంబంధాలకు సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను కూడా పేర్కొన్నాడు. చాణక్య విధానం ప్రకారం, భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం వారి వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వైవాహిక జీవితానికి సంబంధించి చాణక్యుడు సూచించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి.

వయసు అంతరం విషం లాంటిది చాణక్య విధానం ప్రకారం, భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం ఎక్కువగా ఉంటే, సంబంధంలో అనేక ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. వయసుల మధ్య అంతరం కారణంగా వైవాహిక జీవితంలో సమన్వయం కుదరక నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. వృద్ధుడు ఒక యువతిని లేదా యువకుడు తనకంటే ఎక్కువ వయసు తేడా ఉన్న యువతిని వివాహం చేసుకుంటే, ఆ సంబంధం కొనసాగే అవకాశాలు చాలా తక్కువ. చాణక్య విధానం ప్రకారం, అలాంటి వివాహాలు విజయవంతం కావు.

భార్య భర్త కంటే పెద్దదైతే.. భారతదేశం వంటి దేశంలో, పురుషులను వైవాహిక జీవితానికి అధిపతిగా అంగీకరించారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అన్నిటిలో వచ్చినట్లే పెళ్లి విషయంలో కూడా అనెక్ మార్పులు వచ్చాయి, వాస్తవానికి భార్య భర్త కంటే పెద్దదైతే, జీవితంలో అనేక విషయాలలో గందరగోళానికి గురవుతారని నమ్ముతారు. చాలా మంది పురుషులు భార్య ఆధిపత్యాన్ని అంగీకరించలేరు. కాలక్రమేణా సంబంధాలు క్షీణించడం ప్రారంభిస్తాయి.

ఇవి కూడా చదవండి

సంబంధంలో సమానత్వం భార్యాభర్తల మధ్య సమానత్వ భావన ఎప్పుడూ ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. విజయవంతమైన వైవాహిక జీవితం కోసం, స్త్రీ , పురుషులు శారీరకంగా.. మానసికంగా సంతృప్తి చెందడం చాలా అవసరమని ఆచార్య చాణక్య చెప్పారు. ఈక్వేటింగ్ అనేది సంబంధంలో సమస్యలను పెంచుతుంది. అది బంధం విచ్ఛిన్నం అంచుకు చేర్చవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)