Trigrahi Yoga: మకర రాశిలో ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు ధన లాభం, అదృష్టం .. అందులో మీరున్నారా..
మూడు గ్రహాలు ఒకే రాశిలో వస్తే అప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో కొంతమంది జీవితంలో ఈ మూడు గ్రహాల శుభ కలయిక శుభ యోగాన్ని తెలుస్తుంది. ఈరోజు త్రిగ్రాహి యోగం వలన మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు క్రమ వ్యవధిలో తమ గమనాన్ని మార్చుకుంటూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా రాశులు తమ రాశిని మార్చుకునే సమయంలో మానవ జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల రాశుల మార్పు మాత్ఒరమే కాదు.. అనేక గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు.. దీనిని గ్రహాల కలయిక అంటారు. గ్రహాల కలయిక కారణంగా, స్థానికుల జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మూడు గ్రహాలు ఒకే రాశిలో వస్తే అప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీంతో కొంతమంది జీవితంలో ఈ మూడు గ్రహాల శుభ కలయిక శుభ యోగాన్ని తెలుస్తుంది. ఈరోజు త్రిగ్రాహి యోగం వలన మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..
మకరరాశిలో త్రిగ్రాహి యోగం మకరరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. శనీశ్వరుడు ప్రస్తుతం మకరరాశిలో ఉన్నాడు. శని 2022 జూలై 12 నుండి మకరరాశిలో ఉన్నాడు. అదే సమయంలో, శుక్రుడు కూడా మకరరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు జనవరి 14, 2023 న, సూర్యుడు ధనుస్సును విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశించాడు. దీంతో మకరరాశిలో సూర్యుడు-శని, శుక్రుడు సంచరించిస్తుండడంతో త్రిగ్రాహి యోగం ఏర్పడింది.
త్రిగ్రాహి యోగం కన్యారాశికి ప్రయోజనం మకరరాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల కన్యా రాశి వారికీ అన్నింటా అదృష్టం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో మంచి విజయాన్ని పొందుతారు. ఈ రాశిలో, ఈ త్రిగ్రాహి యోగం ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది. జాతకంలో ఐదవ ఇల్లు ఉన్నత విద్య, పిల్లలు , ప్రేమ వివాహం కోసం పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో.. ఈ రాశివారు తమ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినవచ్చు. వివాహం కాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.
తులరాశి త్రిగ్రాహి యోగ ప్రభావం వల్ల తులరాశి వారికి విశేష ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ధనలాభానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులు విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేసి.. ఆనందాన్ని పొందుతారు. ఈ సమయం ఉద్యోగస్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. త్రిగ్రాహి యోగం శుభ ప్రభావం కారణంగా ఈ రాశివారు అనేక అవకాశాలు అందుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)