2019 డిసెంబర్ నెలల్లో చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి.. క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి.. ఓ రేంజ్ లో ప్రజలను వణికిచింది. మన దేశంలో మొదటి సరిగా కేరళలో 2020లో వెలుగులోకి వచ్చింది. మార్చి 2020 నుండి ఈ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి.. మన దేశంలో నేడు అత్యల్ప రోజువారీ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మన దేశంలో కరోనా దాదాపు అదుపులోకి వచ్చినట్లు భావిస్తోంది కేంద్ర మంత్రిత్వ శాఖ.
తాజాగా ఇండియాలో కొత్తగా 89 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య కొవిడ్ ప్రారంభమైన మార్చి 27, 2020 నుంచి నేటి వరకు అత్యల్ప కొవిడ్ కేసుల సంఖ్య అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే క్రియాశీల కేసులు 2,035కి తగ్గాయి.
మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖరిలీజ్ చేసిన డేటా ప్రకారం.. తాజాగా భారతదేశంలో 89 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రెండేళ్ళ క్రితం మొదలైన కరోనా కేసులు 27, 2020 నుండి.. నేటి వరకూ అతి తక్కువ కేసులని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అంతేకాదు.. క్రియాశీల కేసులు 2,035 కి తగ్గాయని తెలిపింది. కోవిడ్ యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం 0.01 శాతం ఉండగా.. జాతీయ స్థాయిలో COVID-19 రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..