ఇద్దరిని కంటే ఒక ఇంక్రిమెంట్.. ముగ్గురైతే రెండు ఇంక్రిమెంట్స్.. సంచలన ప్రకటన చేసిన సీఎం..

అక్కడ పిల్లలు కంటే చాలు.. బహుమతులే బహుమతులు. ఒట్టి గిఫ్ట్‌లేనా.. అంతకు మించి ఉందండోయ్. పిల్లలను కంటే.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇస్తారు.

ఇద్దరిని కంటే ఒక ఇంక్రిమెంట్.. ముగ్గురైతే రెండు ఇంక్రిమెంట్స్.. సంచలన ప్రకటన చేసిన సీఎం..
Sikkim Population
Follow us

|

Updated on: Jan 17, 2023 | 1:55 PM

అక్కడ పిల్లలు కంటే చాలు.. బహుమతులే బహుమతులు. ఒట్టి గిఫ్ట్‌లేనా.. అంతకు మించి ఉందండోయ్. పిల్లలను కంటే.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇస్తారు. సంవత్సరం పాటు ప్రసూతీ సెలవులు ఇస్తారు. తండ్రికి కూడా సెలవులు ఇచ్చేస్తారు. అంతేకాదు.. పిల్లలు పుడితే జీతాలు కూడా పెంచేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు ఒక ఇంక్రిమెంట్, ముగ్గురు పిల్లలకు డబుల్ ఇంక్రిమెంట్ ఇచ్చేస్తున్నారు. ఇదేదో బయటి దేశం అనుకునేరు.. మన దేశంలోనే. అవును, మనదేశంలోని ఓ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల కోసం ఇలాంటి ఆఫర్స్ ప్రకటించింది. మరి ఆ రాష్ట్రమేంటి? ఆ ప్రకటన ఎందుకు చేశారు? వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సిక్కిం రాష్ట్ర జనాభా గణనీయంగా తగ్గుతుందట. దాంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ప్రకటించారు. దక్షిణ సిక్కింలోని జోర్తాంగ్ పట్టణంలో ఆదివారం జరిగిన మాఘ సంక్రాంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. సిక్కిం సంతానోత్పత్తి రేటు ఇటీవలి భారీగా తగ్గిందన్నారు. అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేసిందని, సిక్కిం జాతి జనాభా క్షీణించిందని ఆందోళన వెలిబుచ్చారు.

సిక్కిం ప్రకజలు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడం ద్వారా క్షీణిస్తున్న సంతానోత్పత్తి రేటును నియంత్రించాలని భావిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే స్త్రీలకు 365 రోజుల ప్రసూతి సెలవులను అందజేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే తండ్రి అయిన పురుషులకు కూడా పితృత్వ సెలవులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

పిల్లలు పుడితే డబుల్ ఇంక్రిమెంట్స్..

మహిళ ఉద్యోగులు రెండో బిడ్డను కంటే ఒక ఇంక్రిమెంట్ వేస్తోంది ప్రభుత్వం. అలాగే మూడో బిడ్డను కూడా కంటే రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదండోయ్.. ఎక్కువమంది పిల్లలను కనేందుకు సామాన్య ప్రజలకు కూడా ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు సిక్కిం సీఎం తమాంగ్. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ఆరోగ్య, మహిళా శిశు సంరక్షణ శాఖలు వెల్లడిస్తాయని ప్రకటించారు.

పిల్లలు కాని దంపతుల కోసం ఐవీఎఫ్ సౌకర్యం..

మహిళలు కృత్రిమంగా గర్భం దాల్చేలా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిక్కింలోని ఆస్పత్రుల్లో ‘ఐవిఎఫ్’ సౌకర్యాన్ని కూడా ప్రారంభించిందని సీఎం తమాంగ్ తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా పిల్లలకు జన్మనిచ్చే తల్లులందరికీ రూ. 3 లక్షలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు సీఎం.

సిక్కిం జనాభా..

అయితే, గత ప్రభుత్వాలు ఒకే బిడ్డ నినాదంతో ముందుకెళ్లాయి. తద్వారా ఇప్పుడు రాష్ట్ర జనాభా 7 లక్షలుగా ఉంది. అయితే, గత ప్రభుత్వాల నిర్ణయాల ఫలితమే నేడు రాష్ట్ర జనాభా క్షీణించిందని సీఎం తమాంగ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర జనాభాను పెంచే ఆవశ్యకత ఉందని, ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రయత్నించాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..