AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Jackpot: లక్ అంటే ఇతనిదే.. లాటరీలో 10 వేల కోట్ల గెలుపు.. వాయిదా పద్దతిలో తీసుకునేందుకు అంగీకారం

ఓ సామాన్యుడికి ఏ లాటరీ రూపంలోనో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయనుకోండి... అదృష్టం అంటే వాడిదే.. జాక్‌పాట్‌ కొట్టేసాడుగా అంటారు. సరిగ్గా అదే జరిగింది. ఓ సామాన్య వ్యక్తి ఏకం 10 వేల కోట్ల రూపాయలు లాటరీలో గెలుచుకున్నాడు.

Mega Jackpot: లక్ అంటే ఇతనిదే.. లాటరీలో 10 వేల కోట్ల గెలుపు.. వాయిదా పద్దతిలో తీసుకునేందుకు అంగీకారం
Mega Millions Jackpot
Surya Kala
|

Updated on: Jan 17, 2023 | 10:35 AM

Share

దురదృష్ట వంతుడిని బాగు చేసేవాడు లేదు.. అదృష్ట వంతుడిని పాడు చేసే వాడు లేడు అంటారు పెద్దలు.. అంతేకాదు లక్కి గురించి చెప్పాల్సి వస్తే.. ఏలినాటి అదృష్టం గురించి మీకు తెలుసా.. ఇదేంటి ఏలినాటి శని గురించి తెలుసుకానీ ఏలినాటి అదృష్టం.. అనుకుంటున్నారా.. అవును కొన్నేళ్లపాటు కంటిన్యూగా మంచి జరుగుతుంటే అదే ఏలినాటి అదృష్టం.. ధనం మూలం ఇదమ్‌ జగత్‌ అన్నారు. ఏ పనిచేయాలన్నా ముందు డబ్బు కావాలి. ఎంతో కష్టపడితే కానీ ఆ ధనం సమకూరదు. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అయితే ఓ సామాన్యుడికి ఏ లాటరీ రూపంలోనో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయనుకోండి… అదృష్టం అంటే వాడిదే.. జాక్‌పాట్‌ కొట్టేసాడుగా అంటారు. సరిగ్గా అదే జరిగింది. ఓ సామాన్య వ్యక్తి ఏకం 10 వేల కోట్ల రూపాయలు లాటరీలో గెలుచుకున్నాడు. ఆ ధనాన్ని అతను వాయిదాల పద్ధతిలో పొందనున్నాడు. ఇదేమరి ఏలినాటి అదృష్టం అంటే..

అమెరికాలోని మైన్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌లో 10,973 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా విదేశాల్లో నెలలో ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారాన్ని అన్‌లక్కీడేగా భావిస్తారు. ఆ అన్‌లక్కీ డేనే అతనిపాలిట లక్కీడేగా మారింది. అదే రోజు.. అతడికి ఈ భారీ జాక్‌పాట్‌ తగిలింది. జనవరి 13న మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌ తీసిన డ్రాలో విన్నింగ్‌ టికెట్‌ నెంబర్‌తో అతడి నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిని విజేతగా ప్రకటించింది మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌. అతడు గెలుచుకున్న మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు.. 29 ఏళ్లపాటు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. ఒకవేళ విన్నర్‌ మొత్తం ఒకేసారి కావాలంటే 7వేల కోట్లు మాత్రమే ఇస్తారు. కానీ చాలా మంది వాయిదాల పద్ధతిలో కాకుండా ఒకేసారి తీసుకుంటారు. 2018లో దక్షిణ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే 12,436 కోట్లు గెలుచుకున్నాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..