Andhra Pradesh: వచ్చే సంవత్సరం నుంచే విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ప్రకటన
సీఎం వైఎస్ జగన్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఏపీ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని అసెంబ్లీ వేదికగా తెగేసి చెప్పారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్..
ఏపీలో మూడు రాజధానుల అంశంపై రచ్చ జరుగుతోంది. ఇప్పుడు వీటి చుట్టే రాజకీయం తిరుగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఏపీ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని అసెంబ్లీ వేదికగా తెగేసి చెప్పారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఎలాగైనా మూడు రాజధానులు నిర్మించి తీరుతామంటోంది వైసీపీ. అంతేకాదు మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
వచ్చే సంవత్సరం నుంచే విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపడం సంచలనంగా మారింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేవలం రాజధాని అంశంపై మాత్రమే చర్చ జరగుతుండటం, పరిస్థితులు వేగంగా మారిపోవడం వంటివి జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో విశాఖపట్నం ప్రధాన నగరమన్న అమర్నాథ్.. దేశంలోని టాప్ టెన్ నగరాల జాబితాలో విశాఖ ఉందన్నారు.
రాజధాని నగరాన్ని మార్చడం, లేదా రాజధానిని విభజించడం లేదా..మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రానికీ తన రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
అటు రాష్ట్రం గానీ, ఇటు కేంద్రం గానీ కేంద్రం బదలాయించిన అధికారం ద్వారా సీఆర్‌డీఏ చట్టాన్ని చేసినట్లు ఎక్కడా చెప్పలేదని నివేదించింది.రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోదంటూ కేంద్రమే లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు నివేదించిందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో గుర్తుచేసింది.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం..