Jana Sena Chalo Vissannapeta: జనసేన సరికొత్త వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఛలో విస్సన్నపేటకు సిద్ధమైంది జనసేన. ఏపీ మంత్రి అమర్నాథ్ సవాల్ ను స్వీకరించిన ఆ పార్టీ నేతలు.. కాపేపట్లో విస్సన్నపేట వెళ్లనున్నారు. అక్కడ మంత్రికి 600 ఎకరాల భూమి ఉందనేది ఆ పార్టీ నేతల ఆరోపణ. సవాళ్లేంటి? జనసేన వ్యూహమేంటి? ఆరోపణల వెనుకున్న నిజాలేంటి? అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 195/2లో ఏపీ మంత్రి అమర్నాథ్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కబ్జా చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రికి 600 ఎకరాల భూమి ఉంది, యువకులు మాత్రం 5 వేల రూపాయలకు ఉద్యోగం చేయాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సభలో ప్రశ్నించడంతో ఈ వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఆరోపణలపై గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు మంత్రి అమర్నాథ్. 600 ఎకరాలా? ఎక్కడ ఉందో చెప్పండి, ఏ పేపర్ పై సంతకం పెట్టాలో చెప్పండి, ఉంటే వారినే తీసుకోమనండి అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
నిరూపించేందుకు మేం సిద్ధం ఏం సెంటరో చెప్పండి అంటున్నారు జనసేన నాయకులు. అనకాపల్లి నియోజకవర్గం, కశింపేట మండలం, బయ్యారం రెవెన్యూ పరిధి, సర్వే నెంబర్ 195/2. వివరాలతో సహా ముందుకు వచ్చారు జనసేన నేతలు.
ఓ వైపు రాజకీయ విమర్శలు, మరో వైపు జనసేన ప్రోగ్రాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నేతల కదలికలపై కన్నేసి ఉంచారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..