పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. చనిపోయే ముందు వీడియో కాల్.. చివరకు సుబాబుల్ తోటలో..

ఆ దంపతులు తనువు చాలించాలని ముందే నిర్ణయించుకున్నట్లున్నారు. ఉదయాన్నే లేచి పనికి వెళ్లే వారిలా లంచ్ బ్యాక్స్ లో భోజనం పెట్టుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరారు.

పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. చనిపోయే ముందు వీడియో కాల్.. చివరకు సుబాబుల్ తోటలో..
Crime News
Follow us

|

Updated on: Feb 09, 2023 | 10:05 AM

ఆ దంపతులు తనువు చాలించాలని ముందే నిర్ణయించుకున్నట్లున్నారు. ఉదయాన్నే లేచి పనికి వెళ్లే వారిలా లంచ్ బ్యాక్స్ లో భోజనం పెట్టుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. చనిపోయేందుకు అనువైన ప్రదేశం కోసం వెతికి చివరికి నిర్మానుష్య ప్రాంతమైన సుబాబుల్ తోటను ఎంచుకున్నారు. వెంట తెచ్చుకున్న భోజనం చేసి పురుగుల మందు తాగారు. అనంతరం బంధువులకు వాట్సప్ కాల్ చేసి తాము చనిపోతున్నామని, తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఆందోళనకు గురైన బంధువులు తెలిసిన ప్రాంతాల్లో వెతికారు. వారిది తెలంగాణ కావడంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం మొత్తం వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా వత్సవాయి మండలం వేములవరం సమీపంలోని సుబాబుల్ తోటలో ఉన్నట్లు పోలీసులు మృతదేహాలను గుర్తించారు.

మృతులు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుకు చెందిన దంపతులు పుట్టా నాగేశ్వరరావు (36), శ్రీకళ (34)గా పోలీసులు గుర్తించారు. ఈ దంపతులకు పది, ఎనిమిది తరగతులు చదివే ఇద్దరు కుమారులున్నారని.. వారికి ఎటువంటి సమస్యలు లేవని, ఎందుకు తనువు చాలించాలనుకున్నారో తెలియదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.

అయితే, రెండు నెలల కిందట తాపీ పనుల కోసమని నందిగామ మండలం అనాసాగరం వచ్చిన ఈ దంపతులు.. అక్కడే పనిచేసుకుంటూ నివాసముంటున్నారు. ఈ తరుణంలో ఏం జరిగిందో ఏమో కానీ.. మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యచేసుకున్నట్లు నందిగామ పోలీసులు తెలిపారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..