మృత్యువు ఏ రూపంలో వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. వివిధ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పదేపదే చెబుతుంటారు. తాజాగా కాకినాడలోని పెద్దపురం మండలం జి.రాగంపేటలో విషాదం చోటు చేసుకుంది. అంబటి సుబ్బయ్య ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేసేందుకు కార్మికులు ట్యాంకర్‌లోకి దిగారు. ప్రమాదవశాత్తు ట్యాంకర్‌లో ఊపిరాడకపోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరువాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.
కాగా, ఇలాంటి ఘటనల్లో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని కార్మికుల బతుకులు ఛిద్రమైపోతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి