Andhra Pradesh: నైరుతి వస్తున్నా తగ్గని భగభగలు.. వచ్చే మూడు రోజులు నిప్పులకొలిమిలా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే సెగలు కక్కుతున్నాడు. రాత్రయినా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపించడం లేదు. నైరుతి రుతుపవనాలతో వాతావరణం...
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే సెగలు కక్కుతున్నాడు. రాత్రయినా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపించడం లేదు. నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడుతుందని భావించినప్పటికీ ఎండ తీవ్రత ఏ మాత్రం తగ్గటం లేదు. రాబోయే 3 రోజులు ఏపీలో(High Temperatures in AP) అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణగాలుల ప్రభావం పెరుగుతుందని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రాగల మూడు రోజుల్లో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో 46- 47 డిగ్రీలు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43-45 డిగ్రీలు, విశాఖపట్నం, కడప, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 40 -42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
కాగా గడిచిన 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని ప్రాంతాల్లో 40-45 డిగ్రీలు ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డీ హైడ్రేషన్‌కు గురికాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి