Guntur: ఒంటరిగా వాకింగ్‌కు వెళ్లిన మహిళను అనుసరించిన వ్యక్తి.. కొంతదూరం వెళ్లాక
రోజులానే ఆ గ్రామానికి చెందిన మహిళ సోమవారం ఉదయం వాకింగ్ కు వెళ్లింది. అయితే గుర్తు తెలియని బీహర్‌కు చెందిన వ్యక్తి ఆమెపై దాడి చేసి.. అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. స్థానికులు సకాలంలో స్పందించి మహిళను కాపాడి.. ఆ వ్యక్తికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అది జాతీయ రహదారిపై ఉండే గ్రామం… గుంటూరు రూరల్ మండలం బొంతపాడు. గ్రామానికి చెందిన వారు ఉదయాన్నే జాతీయ రహదారి అప్రోచ్ రోడ్డుపై వాకింగ్‌కు వెళ్తుంటారు. రోజులానే ఆ గ్రామానికి చెందిన మహిళ సోమవారం ఉదయం వాకింగ్ కు వెళ్లింది. అయితే గుర్తు తెలియని బీహర్‌కు చెందిన వ్యక్తి ఆమెపై దాడి చేసి.. అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. స్థానికులు సకాలంలో స్పందించి మహిళను కాపాడి.. ఆ వ్యక్తికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బొంతపాడు గ్రామానికి చెందిన మహిళ ఈ రోజు ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లింది. ఒంటరిగా వాకింగ్ కు వెళ్లడం ఆమెకు అలవాటు. ప్రతిరోజు లాగే ఆమె చకచక అడుగులు వేసుకుంటూ వెళ్తుంది. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత తనను ఓ వ్యక్తి ఫాలో అవ్వడం ఆమె గమనించింది. ఎవరో రోడ్డున పోయే వ్యక్తి అనుకుని ఆమె ముందుకు వెళ్లింది. కొంతసేపటికే అనుసరిస్తున్న వ్యక్తి ఆమెపై దాడి చేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అతని చెర నుండి తప్పించుకున్న మహిళ గట్టిగా కేకలు వేసింది.
దీంతో సమీపంలో ఉన్న స్థానికులు స్పందించారు. వెంటనే బీహర్ కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దేహ శుద్ది చేసి.. కాళ్లు, చేతులు కట్టిపడేశారు. అక్కడ నుండి వ్యవసాయ క్షేత్రంలో ఈడ్చుకుంటూరోడ్డు వరకూ తీసుకువచ్చారు. అక్కడే ఉన్న కరెంట్ స్థంభానికి కట్టిపడేశారు. పోలీసులు వచ్చిన తర్వాత బీహార్ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.
అయితే బొంతపాడు చుట్టు పక్కల జిన్నింగ్ మిల్లులతో పాటు ఇతర పరిశ్రమలున్నాయి. వీటిల్లో పనిచేసేందుకు ఇతర ప్రాంతాల నుండి కార్మికులు వస్తుంటారు. వీరు ఒక్కోసారి ఒంటిరి మహిళలపై దాడులు చేస్తుంటారు. ఈ రోజు ఉదయం కూడా బీహార్ చెందిన వ్యక్తి దాడికి యత్నించడంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ వ్యక్తిపై దాడి చేయడమే కాకుండా విచక్షణారహితంగా కాళ్లు, చేతులు కట్టిపడేసి వ్యవసాయ క్షేత్రంలో లాక్కొని వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందుతుడిపై తీవ్రంగా దాడి చేసిన స్థానికులపై కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
