Mekathoti Sucharita: ఆయనొక పార్టీలో.. నేను మరో పార్టీలో ఉండను.. మాజీ హోంమంత్రి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jan 05, 2023 | 11:26 AM

మాజీ మంత్రి, వైసీపీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానిచ్చిన స్టేట్ మెంట్‌కు నా భర్త దయాసాగర్ కూడా కట్టుబడే ఉంటారని...

Mekathoti Sucharita: ఆయనొక పార్టీలో.. నేను మరో పార్టీలో ఉండను.. మాజీ హోంమంత్రి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు..
Mekathoti Sucharita
Follow us on

మాజీ మంత్రి, వైసీపీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయంగా మా మనుగడ వైసీపీతోనే.. నేనిచ్చిన స్టేట్ మెంట్‌కు నా భర్త దయాసాగర్ కూడా కట్టుబడే ఉంటారు. అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను.. నువ్వు నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్ళాల్సిందేగా’’.. అంటూ కామెంట్‌ చేశారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో సుచరిత మాట్లాడారు. దయాసాగర్‌ ఒక పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో, పిల్లలు చెరొక పార్టీలో ఉండరంటూ సుచరిత పేర్కొన్నారు.

అందువల్ల రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీతో ఉండాలని అనుకుంటున్నామంటూ పేర్కొన్నారు. తాము వైసీపీ కుటుంబ సభ్యులమని పేర్కొన్నారు. ఒకే ఇంట్లో ఉండే ఐదుగురిలో కూడా విబేధాలు ఉంటాయి. అంత మాత్రాన వారు వేరని కాదంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మేకతోటి సుచరిత చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

కాగా.. మేకతోటి సుచరిత గతంలో హోంమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, రెండోసారి ఆమెకు మంత్రిగా అవకాశం దక్కకపోవడంతో.. ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు. చివరకు ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య వైసీపీలోనే ఉంటున్నట్లు సుచరిత ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..