Tree Man in AP: కాంక్రీట్ జంగిల్స్లో పచ్చదనం నింపుతున్న వృక్ష ప్రేమికుడు… మొక్కల నాటే యజ్ఞం చేస్తున్న విజయవాడకు చెందిన వ్యక్తి
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఆయన ఎదురుచూడరూ నగరవాసిగా తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తారు. పచ్చదనమంటే ఆయనకు ప్రాణం... వృక్ష ప్రేమికుడు... మొక్కల పెంచాలని మొక్కువోని దీక్షతో ఒక యజ్ఞం చేస్తున్నారు విజయవాడ కు చెందిన కొడాలి సుభాష్ చంద్రబోస్
Tree Man in AP: పచ్చని పచ్చదనం కల్లారా చూస్తేనే చాలు.. మనసుకు హాయిగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈ కాంక్రీట్ జంగిల్స్లో పచ్చదనం కోసం వెతకాల్సిన పరిస్థితి.ఎక్కడపడితే అక్కడ వృక్షాలు నరికేయడంతో అకాల వర్షాలు,అధిక ఉష్ణోగ్రతలు,కాలుష్య శాతం అధికంగా నమోదవుతున్నట్లు వాతన శాఖ నిపుణులు చెప్తున్నారు.కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో ప్రకృతి,పర్యావరణం కోసం ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువ అయ్యారు. పర్యావరణం కోసం ఆలోచిస్తున్న అతి కొద్ది మందిలో విజయవాడలో ఉన్న ట్రీ మ్యాన్ ఒక్కరు. 36 ఏళ్లలో 3600 పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఆయన ఎదురుచూడరూ నగరవాసిగా తన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తారు. పచ్చదనమంటే ఆయనకు ప్రాణం… వృక్ష ప్రేమికుడు… మొక్కల పెంచాలని మొక్కువోని దీక్షతో ఒక యజ్ఞం చేస్తున్నారు విజయవాడ కు చెందిన కొడాలి సుభాష్ చంద్రబోస్. అందరికీ ట్రీ మ్యాన్ గా సుపరిచితమైన బోస్ గారు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న కృషికి ఫలితం..ఎందరో విమర్శకుల ప్రశంసలు అనే చెప్పలి.
సిద్దార్ధ అకాడమీ లో భాగమైన 16 కాలేజీలలో ఎన్నో వందల వృక్ష జాతులను నాటిన వ్యక్తి బోస్…ఇప్పుడు పిన్నమనేని సిద్దార్థ మెడికల్ కాలేజిలో 50 ఏకరల్లో ఎన్నో వృక్షాలు ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణ నెలకొంది.దీనికి బోస్ కాలేజీ యాజమాన్యం పిలుపుతో 2002 లో అక్కడ మొక్కలు నాటారు.ఇప్పుడు ఇక్కడికి చికిత్స కోసం వస్తున్న వారికి ప్రకృతి రమణీయతను పరిచయం చేస్తు ఆరోగ్యాని ప్రసాదిస్తున్నాయి
నిత్యం వందల వాహనాలతో రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ ప్రాంతం లో పచ్చదనాన్ని సృష్టించిన వ్యక్తిగా ఆయన పేరు వినపడుతుంది.ప్రసాదం పాడు నుండి స్క్రూ బ్రిడ్జి వరకు రెండుపక్కల సర్వీస్ రోడ్ 10 కిలోమీటర్ల మేర సొంత డబ్బుతో నాటిన వ్యక్తిగా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
Reporter: Vikram, Tv9 Telugu