CM Jagan: అరోగ్యశ్రీ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పూర్తి వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యమంత్రి జగన్. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కీలక విషయాలను తెలిపారు.
ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు ప్రస్తుతం ఉన్న కార్డుపై అదనంగా మరికొన్ని వ్యాధులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే ఇప్పటి వరకూ ఉన్న అరోగ్యశ్రీ కార్డు పరిమితిని పెంచినట్లు తెలిపారు. ఈ పెంచిన పరిమితితో రూ. 25 లక్షలకు ఎలాంటి అపరేషన్ అయినా ఉచితంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండటానికి వీల్లేదన్నారు మంత్రి రజినీ. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఈనెల 18 నుంచి పరిమితి పెంచిన ఆరోగ్యశ్రీ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారన్నారు. ఈమేరకు అతి త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయాలు డిజిటల్ చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తద్వారా గతంలో వైద్యనిమిత్తం వచ్చిన రోగుల పూర్తి వివరాలు అందులో ఉంటాయని.. ఏ వైద్యుడిని సంప్రదించినా అతని అనారోగ్య తీవ్రత ఇట్టే అర్థమైపోతుందని వివరించారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ, ఈ మూడింటికి సంబంధించిన డేటా ఒకే చోట ఉండేలా సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. అలాగే జగనన్న సురక్ష రెండో విడత కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతామని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..