Andhra Pradesh: దుబాయ్ వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన గుంటూరు వైద్యులు

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాలను కాదనుకుని గుంటూరుకు వచ్చాడు. అరుదైన శస్త్రచికిత్స కోసం 22 ఏళ్ల యువకుడు దుబాయ్ నుంచి గుంటూరు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. శస్త్ర చికిత్స అనంతరం ఆ యువకుడు కోలుకుంటున్నాడు. ఇంతకీ అతనికి వచ్చిన వ్యాధి ఏమిటంటే.. దుబాయ్‌కి చెందిన దేయా మొహమ్మద్ అనే వ్యక్తి అరుదైన లక్షణాలతో బాధపడుతున్నాడు. ఇరవై రెండు ఏళ్ల వయస్సుకే పిట్యూటరీ ట్యూమర్ తో అనారోగ్యం పాలయ్యాడు. పిట్యూటరీ ట్యూమర్ ఉన్న వాళ్లలో అక్రోమెగలీ లక్షలణాలు కనిపిస్తాయి..

Andhra Pradesh: దుబాయ్ వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్స చేసిన గుంటూరు వైద్యులు
Dr Rao's Hospital
Follow us
T Nagaraju

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 06, 2023 | 3:37 PM

గుంటూరు, డిసెంబర్‌ 6: ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాలను కాదనుకుని గుంటూరులోని డాక్టర్ రావూస్ హాస్పిటల్ కి వచ్చాడు. అరుదైన శస్త్రచికిత్స కోసం 22 ఏళ్ల యువకుడు దుబాయ్ నుంచి గుంటూరు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. శస్త్ర చికిత్స అనంతరం ఆ యువకుడు కోలుకుంటున్నాడు. ఇంతకీ అతనికి వచ్చిన వ్యాధి ఏమిటంటే.. దుబాయ్‌కి చెందిన దేయా మొహమ్మద్ అనే వ్యక్తి అరుదైన లక్షణాలతో బాధపడుతున్నాడు. ఇరవై రెండు ఏళ్ల వయస్సుకే పిట్యూటరీ ట్యూమర్ తో అనారోగ్యం పాలయ్యాడు. పిట్యూటరీ ట్యూమర్ ఉన్న వాళ్లలో అక్రోమెగలీ లక్షలణాలు కనిపిస్తాయి. అక్రోమెగలీ ఉన్నవారికి చేతులు, కాళ్లు అసాధారణ స్థాయిలో పెరిగిపోతాయి. ముఖంపై ముడతలు వస్తాయి. అంతేకాకుండా కీళ్ల నోప్పులు, గుండె, కాలేయం, ప్లీహం వంటి అవయవాలు కూడా పెరిగిపోతుంటాయి. ఈ అరుదైన లక్షణాలు మొహమ్మద్ లోనూ కనిపించాయి.

అయితే ఎక్కడ వైద్యం చేయించుకోవాలో అర్ధం కాలేదు. అన్ని చోట్ల ప్రయత్నించాడు. అయితే గుంటూరులోని డాక్టర్ రావూస్ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ పాటిబండ్ల మోహన్ రావు అక్రోమెగలీకి మెరుగైన వైద్యం చేస్తాడని తెలుసుకున్నాడు. వెంటనే డాక్టర్ ని ఆన్ లైన్ లో సంప్రదించగా గుంటూరు రావాలని సూచించాడు. దీంతో మొహమ్మద్ గుంటూరులోని రావూస్ హాస్పిటల్ కు చేరుకున్నాడు. మిగిలిన వైద్యం బ్రందంతో చర్చించిన తర్వాత డాక్టర్ మోహన్ రావు శస్త్రచికిత్స చేశారు. గుంటూరు వైద్యులు శస్త్ర చికిత్స చేసి పిట్యూటరీ ట్యూమర్‌ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆసుపత్రిలోనే కోలుకుంటున్నాడు.

డాక్డర్ మోహన్ రావు మాట్లాడుతూ.. పిట్యూటరీ ట్యూమర్‌ను తొలగించాలంటే న్యూరో మానిటరింగ్, న్యూరో నావిగేషన్, 4కే ఎండోస్కోపి వంటి అధునాతన పరికాలు కావాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతోనే అధునాతన పరికరాలతో ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తుండటంతో ఇతర దేశాల నుంచి కూడా రోగులు టైర్ 3 సిటీ అయిన గుంటూరుకు క్యూ కడుతున్నారని అన్నారు. మెట్రో నగరాల్లో ఇటువంటి ఆపరేషన్లు చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. గుంటూరు జిల్లా వైద్యుల ఖిల్లాగా పేరుగాంచింది. దీంతో గుంటూరు లాంటి నగరానికి వచ్చి చికిత్స చేయించుకుంటున్న విదేశీయులు సంఖ్య పెరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.