CM Jagan: విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. సీఎం జగన్ సంచలన నిర్ణయం..
మిచౌంగ్ తుపాన్ వరద బాధితుల సహాయంతో పాటూ ప్రస్తుత పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ముంపు ప్రాంతాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. వారికి సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి.

మిచౌంగ్ తుపాన్ వరద బాధితుల సహాయంతో పాటూ ప్రస్తుత పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ముంపు ప్రాంతాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. వారికి సీఎం జగన్ కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి. అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలన్నారు. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించాలన్నారు. బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలని దిశానిర్ధేశం చేశారు. రూ.10లు ఎక్కువైనా పర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలని కోరారు.
ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలని అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కాని, క్యాంపుల నుంచి ప్రజలను తిరిగి పంపించే సందర్భంలోకాని వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలన్నారు. రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదని చెప్పారు. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని అదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండన్నారు. వర్షాలు తగ్గుముఖంపట్టిన ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండని చెప్పారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం అని ప్రకటించారు. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వాలంటీర్ల దగ్గర నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








