AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kargil Vijay Diwas: రావి ఆకుపై అద్భుత చిత్రం.. కార్గిల్ యుద్ధ వీరులకు విద్యార్థని ఘన నివాళి

కార్గిల్‌ యుద్ధానికి నేటితో 25 ఏళ్లు.. ఈ సందర్భంగా నాటి విజయాన్ని, అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ 'విజయ్‌ దివస్‌'ను నిర్వహించుకుంటున్నాం. పాకిస్థాన్‌ మూకల్ని కార్గిల్ నుంచి తరిమికొట్టిన ఈ రోజు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.

Kargil Vijay Diwas: రావి ఆకుపై అద్భుత చిత్రం.. కార్గిల్ యుద్ధ వీరులకు విద్యార్థని ఘన నివాళి
Kargil Vijay Diwas
J Y Nagi Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 26, 2024 | 7:51 AM

Share

కార్గిల్‌ యుద్ధానికి నేటితో 25 ఏళ్లు.. ఈ సందర్భంగా నాటి విజయాన్ని, అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ ‘విజయ్‌ దివస్‌’ను నిర్వహించుకుంటున్నాం. పాకిస్థాన్‌ మూకల్ని కార్గిల్ నుంచి తరిమికొట్టిన ఈ రోజు మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఓ విద్యార్థి అద్భుతమైన ప్రతిభతో కార్గిల్ వీరులకు ఘనంగా నివాళిలర్పించారు.

కర్నూలు జిల్లా, ఆదోని మాండలం, అలసందగుత్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9 వ తరగతి విద్యార్థిని నిఖిత రావి ఆకుపై దేశ సైనికులు మన త్రివర్ణ పతాకాన్ని అద్భుతంగా కత్తిరించి చిత్రాన్ని తయారు చేసింది. కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన మన దేశ సైనికులను స్మరించుకునేందుకు ఈ చిత్రాన్ని చేసినట్టు నిఖిత తెలిపింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ చిత్రాన్ని చేసినట్టు పేర్కొంది. చిన్న వయసులోనే నిఖిత తన దేశభక్తిని అద్భుతంగా చాటుకుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను ప్రతి ఒక్కరు స్మరించుకున్నారు. ఈ సందర్భగా ప్రధానోపాధ్యాయురాలు గిరిజాదేవి, ఉపాధ్యాయులు విద్యార్థిని నిఖితను అభినందించారు.

వీడియో చూడండి…

1999, మే 3న కార్గిల్ జిల్లాలోకి పాక్‌ చొరబాట్లతో యుద్ధం మొదలైంది. నియంత్రణ రేఖ వెంట పాక్‌ బలగాల కుట్రల్ని ఒక్కొక్కటిగా విచ్ఛిన్నం చేస్తూ సైన్యం ముందుకు కదిలింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో నాటి ఆపరేషన్‌ కొనసాగింది. దాదాపు 2 నెలలపాటు ఈ యుద్ధం కొనసాగింది. తుపాకుల గర్జనలు.. బోఫోర్స్‌ శతఘ్నుల మోతలు.. వాయుసేన భీకర దాడులు.. 60 రోజులపాటు రాత్రీపగలూ తేడాలేదు. శత్రుమూకల్ని తరిమికొడుతూ చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య ఈ ఆపరేషన్‌ జరిగింది. జూలై 26కి మన భూభాగంలోకి చొరబడ్డ పాక్ సైన్యాన్నంతటినీ తరిమికొట్టారు భారత జవాన్లు. మాతృభూమి రక్షణ కోసం జరిగిన ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ మనం ఏటా ఈ విజయ్‌ దివస్‌ను జరుపుకుంటున్నాం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..