AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కాపురం జిల్లాలో వింత ఘటన.. అమ్మవారి విగ్రహానికి అదనంగా రెండు కళ్లు..

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలో వింత ఘటన చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయంలోని కంచి అమ్మవారి విగ్రహానికి సాధారణ కళ్ళకు పైన మరో రెండు కళ్ళు కనిపిస్తున్నాయని అర్చకులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఈ విధంగా కనిపిస్తుండటంతో భక్తులు అద్భుతంగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మార్కాపురం జిల్లాలో వింత ఘటన.. అమ్మవారి విగ్రహానికి అదనంగా రెండు కళ్లు..
Ammavaru
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 07, 2026 | 3:21 PM

Share

మార్కాపురం జిల్లాలో ఓ వింత ఘటన భక్తులను ఆకట్టుకుంటోంది. గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలోని గ్రామదేవత పోలేరమ్మ ఆలయంలో కంచి అమ్మవారి విగ్రహానికి అదనంగా మరో రెండు కళ్లు కనిపిస్తున్నాయని అర్చకులు చెబుతున్నారు. దీంతో ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారగా.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం పోలేరమ్మ ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఐదు రోజులుగా అమ్మవారి విగ్రహానికి సాధారణంగా ఉండే పెట్టుడు కళ్లకు పైన మరో రెండు కళ్లు కనిపిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. కంచి అమ్మవారికి నయనం (కళ్లు) అత్యంత ప్రధానమని.. ఈ విధంగా అమ్మవారి విగ్రహంపై అదనంగా కళ్ళు కనిపించడం అద్భుతంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కంచి కామాక్షి అమ్మవారికి ప్రత్యేకత

కంచి కామాక్షి అమ్మవారి చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. కంచిలోని ప్రసిద్ధ కామాక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారే ప్రధాన దేవత. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని భక్తుల విశ్వాసం. అష్టాదశ శక్తిపీఠాల్లో కంచి పీఠం కూడా ఒకటిగా చెబుతారు. కామాక్షి అమ్మవారికి స్థూల, సూక్ష్మ, శూన్య అనే మూడు రూపాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. అమ్మవారి కంటి చూపులో దయ, జ్ఞానం, ఐశ్వర్యం కలగలిసి ఉంటాయని విశ్వసిస్తారు. అలాంటి కంచి కామాక్షి అమ్మవారి రూపంలో ఉన్న దేవతామూర్తిని క్రిష్టంశెట్టిపల్లెలోని పోలేరమ్మ ఆలయంలో సుమారు తొమ్మిదేళ్ల క్రితం ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 9వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలోనే గత ఐదు రోజులుగా అమ్మవారి విగ్రహానికి ఉన్న కళ్ళకు పైన మరో రెండు కళ్ళు కనిపిస్తున్నాయని అర్చకులు చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. అమ్మవారి విగ్రహంపై అదనంగా కనిపిస్తున్న కళ్ళను దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఘటనపై గ్రామంలో ఆసక్తి నెలకొంది.

వీడియో దిగువన చూడండి…

Follow Us