Basement Construction: కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
Basement Construction: 1200 చదరపు అడుగుల ఇంటి పునాది (బేస్మెంట్) నిర్మాణానికి అయ్యే ఖర్చులను ఈ కథనం వివరిస్తుంది. సిమెంట్, ఇసుక, స్టీల్, ఇటుకలు, కంకర, మేస్త్రీ, కూలీల ఖర్చులను వివరంగా తెలుసుకుందాం.. మొత్తం నిర్మాణానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది..?

Basement Construction: కొత్త ఇంటి నిర్మాణం చేపట్టేవారికి పునాది (బేస్మెంట్) వేయడానికి అయ్యే ఖర్చుల గురించి పూర్తి అవగాహన అవసరం. ఇందులో 133 గజాలు (సుమారు 1200 చదరపు అడుగులు, 40 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు) ఉన్న ఒక ఇంటి పునాది నిర్మాణానికి అయ్యే వివిధ ఖర్చులను వివరంగా తెలుసుకుందాం. దీనికి సంబంధించిన వివరాలు ఓ ఇంటిని నిర్మించిన యజమాని ద్వారా అందిస్తున్నాము. ఈ పనులు మొత్తం ఆరు రోజుల్లో ఎనిమిది మంది వర్కర్లతో పూర్తి చేయవచ్చంటున్నారు.
ఇది కూడా చదవండి: Gold Price: రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గడానికి 5 కారణాలు.. అవేంటో తెలుసా..?
మెటీరియల్ ఖర్చులు:
1. ఇసుక: పునాది నిర్మాణానికి సుమారు 6 యూనిట్ల ఇసుక అవసరం అవుతుంది. దీనికి అంచనా వ్యయం రూ.12,000.
2. సిమెంట్: సుమారు 100 బస్తాల సిమెంట్ వినియోగించబడింది. ఒక్కో బస్తా రూ.300 చొప్పున మొత్తం రూ.30,000 ఖర్చు అవుతుంది.
3. స్టీల్ / ఐరన్: ఇంటి పునాదికి అత్యంత ముఖ్యమైనది స్టీల్. సుమారు 1.5 టన్నుల స్టీల్ అవసరం. దీనికి దాదాపు రూ.90,000 వరకు ఖర్చు అవుతుంది.
4. ఇటుకలు: బేస్మెంట్ నిర్మాణం, చుట్టూ కాంపౌండ్ వాల్ కోసం సుమారు 8,000 ఇటుకలు అవసరమవుతాయి. ప్రస్తుతం ఒక ఇటుక ధర రూ.7 చొప్పున, ఇటుకలకు మొత్తం రూ.56,000 ఖర్చు అవుతుంది.
5. కంకర: ఈ నిర్మాణానికి 3 యూనిట్ల కంకర వినియోగించబడింది. దీనికి సుమారు రూ.18,000 ఖర్చు అవుతుంది.
కూలీల ఖర్చులు:
పునాది నిర్మాణ పనులకు రాడ్ బెండర్లు, మేస్త్రీలు, హెల్పర్లు వంటి వర్కర్లు అవసరం. ఈ ఎనిమిది మంది సభ్యుల బృందం ఆరు రోజులలో పనిని పూర్తి చేసింది. వర్కర్లందరికీ కలిపి అంచనా వ్యయం సుమారు రూ.1,00,000. మేస్త్రీల ఖర్చులు ప్రాంతాన్ని బట్టి, పనితీరును బట్టి మారవచ్చు.
మొత్తం అంచనా ఖర్చు:
ఈ అన్ని ఖర్చులను కలుపుకుని, 1200 చదరపు అడుగుల ఇంటి పునాది నిర్మాణానికి అయ్యే అంచనా వ్యయం క్రింది విధంగా ఉంది: ఇసుక: 12,000
- సిమెంట్: రూ.30,000
- స్టీల్: రూ.90,000
- ఇటుకలు: రూ.56,000
- కంకర: రూ.18,000
- కూలీలు: రూ.1,00,000
- మొత్తం అంచనా వ్యయం: రూ.3,06,000.
ఇది సుమారు రూ.3,00,000 నుండి రూ.3,10,000 వరకు ఉండవచ్చు. అదనంగా, నిర్మాణ సమయంలో యజమానులు అందించే టిఫిన్లు, ఆహారం వంటి అదనపు ఖర్చులు మరో రూ.10,000 నుండి రూ.20,000 వరకు చేరవచ్చు. అందుకే మొత్తం ఖర్చు రూ.3,10,000 నుండి రూ.3,20,000 వరకు కావచ్చని అంచనా.
ముఖ్య గమనిక:
నిర్మాణ ఖర్చులు ప్రాంతం, మెటీరియల్ ధరలు, మట్టి పరిస్థితి, ఇంజనీర్ సూచించే ఫౌండేషన్ డిజైన్‌ను బట్టి మారవచ్చు. ఈ వివరాలు ఒక అంచనా మాత్రమే,ఇది మీకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా? అవాక్కవాల్సిందే..!
ఇది కూడా చదవండి: Hair Mistakes: తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. జుట్టు డ్యామేజ్ అవుతుంది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




