AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న పని చేయండి..

కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, తిన్నది సరిగ్గా అరగకపోవడం.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరినీ వేధించే సర్వసాధారణ సమస్యలివి. వీటికి ట్యాబ్లెట్లతో పనిలేకుండా, మన వంటింట్లోనే దొరికే సహజసిద్ధమైన సంజీవని మజ్జిగ. మజ్జిగను భోజనం తర్వాత క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న పని చేయండి..
Benefits Of Drinking Buttermilk
Krishna S
|

Updated on: Sep 07, 2026 | 3:42 PM

Share

ఆధునిక జీవనశైలిలో చాలామంది భోజనం ముగియగానే కూల్ డ్రింక్స్ తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటికి బదులుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న పల్చటి మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి అమృతంలా పనిచేస్తుందని ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ కొవ్వుతో, పుష్కలమైన పోషకాలు అందించే మజ్జిగతో శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, తేన్పులు, నోరు ఊరడం వంటి సమస్యలు తగ్గుతాయి. మజ్జిగలో ఉండే సహజసిద్ధమైన ప్రోబయోటిక్స్ కడుపులో హానికర బ్యాక్టీరియాను అణచివేసి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అల్లం, జీలకర్ర, నల్లమిరియాలు, పచ్చిమిర్చి జోడించి తీసుకుంటే నూనె, మసాలా పదార్థాలు సైతం సులభంగా జీర్ణమవుతాయి. ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కడుపు లోపలి పొర దెబ్బతినకుండా ఇది రక్షణ కల్పిస్తుంది.

శరీర డిటాక్సిఫికేషన్ – బరువు నియంత్రణ

మజ్జిగలోని రిబోఫ్లేవిన్ అనే విటమిన్ కాలేయం పనితీరును మెరుగుపరచి, శరీరం నుండి వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపడానికి తోడ్పడుతుంది. ఇందులో కేలరీలు, కొవ్వు అత్యల్పంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ పానీయం. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే, అనవసరమైన జంక్ ఫుడ్ క్రేవింగ్స్‌ను అరికడుతుంది.

కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణ

రోజూ ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మజ్జిగలోని పాల కొవ్వు ప్రోటీన్లు రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అమెరికాలో జరిగిన అధ్యయనాల ప్రకారం, మజ్జిగ క్రమంతప్పకుండా తీసుకునే వారిలో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు.

విటమిన్ల గని.. చర్మానికి పోషణ

మజ్జిగ సమతుల్య పోషకాల భాండాగారం. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్‌లతో పాటు విటమిన్ ఎ, బి-కాంప్లెక్స్, డి, ఇ సమృద్ధిగా ఉంటాయి.

రోగనిరోధక శక్తి: విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

నీరసం మాయం: విటమిన్ బి కాంప్లెక్స్ అలసట, రక్తహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.

చర్మానికి మెరుపు: మజ్జిగలోని సహజ గుణాలు చర్మాన్ని బిగుతుగా ఉంచి, సహజమైన కాంతిని అందించడంలో సహాయపడతాయి.

రసాయన కూల్ డ్రింక్స్ పక్కనపెట్టి, రోజువారీ భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగను అలవాటు చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

Follow Us