AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం

సెప్టెంబర్ 7 నుంచి బుధుడు ఉచ్ఛ స్థితిలోకి రావడం, శుక్రుడు తులా రాశిలో స్వస్థానంలో సంచరించడం, గురువు ఉచ్ఛ స్థితిలో ఉండటం వంటి శుభ గ్రహాల అనుకూల ప్రభావాలతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 15 వరకు ఈ గ్రహబలం కొనసాగడంతో పాత సమస్యలు, వివాదాలు, మానసిక ఒత్తిళ్లు క్రమంగా తొలగిపోయే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు ఈ కాలంలో ప్రశాంతత, సానుకూల మార్పులను అనుభవించే అవకాశం ఉంది.

Astrology: మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 07, 2026 | 3:35 PM

Share

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శుభ గ్రహాలు బలంగా, అనుకూలంగా ఉన్న పక్షంలో కొన్ని రాశులవారు సమస్యలు లేని నిశ్చింత జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఈ నెల(సెప్టెంబర్) 7న బుధుడు ఉచ్ఛ స్థితికి రావడం, శుక్రుడు తులా రాశిలో స్వస్థానంలో సంచారం చేయడం, గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల పాత సమస్యలు, వివాదాలు, ఒత్తిళ్లు తొలగిపోవడం, కొత్తవి రాకపోవడం జరుగుతుంది. ఈ మూడు శుభ గ్రహాలు అక్టోబర్ 15 వరకు అనుకూలంగా ఉండడం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులవారు మానసిక ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.

వృషభ రాశి

ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడితో పాటు బుధ, గురు గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆస్తి సమస్యల నుంచి కూడా పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధాసక్తులు పెరగడం వల్ల అధికారుల ఆదరణ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాల్ని పెద్దల మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకుంటారు. ఇతరులకు డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది..

మిథున రాశి

ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడు చతుర్థ స్థానంలోనూ, గురువు ధన స్థానంలోనూ ఉచ్ఛపడు తున్నందువల్ల ఉద్యోగ సంబంధమైన ఆటంకాలు, అడ్డంకులు, సమస్యల నుంచి పూర్తిగా బయట పడడం జరుగుతుంది. ఉద్యోగంతో పాటు వృత్తి, వ్యాపారాల్లో కూడా మానసిక ఒత్తిడి తగ్గి, అవి నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవు తాయి. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి

ఈ రాశివారికి శుభ గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని రకాలు సమస్యల నుంచి విముక్తి లభించి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి.

కన్యా రాశి

రాశ్యధిపతి బుధుడు ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, లాభ స్థానంలో గురువు, ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారి జీవితం నెలన్నర రోజుల పాటు అనుకున్నది అనుకున్నట్టుగా సాగిపోతుంది. చేపట్టిన ప్రతి ప్రయత్నమూ సునాయాసంగా నెరవేరుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తేలికగా సఫలమవుతాయి. ఆదాయం బాగా వృద్ది చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి..

తులా రాశి

రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో, ఉచ్ఛ గురువు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఈ ప్రయత్నమైనా సులువుగా నెరవేరుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కలతో పాటు సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది..

మకర రాశి

ఈ రాశికి సప్తమ, భాగ్య, ఉద్యోగ స్థానాలు శుభ గ్రహాలతో బలపడినందువల్ల ప్రధాన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి, కొన్ని వివాదాలు, కోర్టు కేసుల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. వివాదాల్లో తలదూర్చవద్దు.. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.

Follow Us
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..