AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gajakesari Yoga 2026: అరుదైన గజకేసరి యోగం.. వీరికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం

Telugu Astrology: సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో కర్కాటక రాశిలో చంద్రుడు, ఉచ్ఛస్థితిలో ఉన్న గురువుతో కలవడం వల్ల అరుదైన గజకేసరి యోగం ఏర్పడనుంది. జ్యోతిష్య పరంగా అత్యంత శుభప్రదమైన ఈ మూడు రోజుల్లో కొన్ని రాశుల వారు కొత్త పనులు, ముఖ్యమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూల సమయం. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఉద్యోగం, వివాహం, ఆర్థిక విషయాలు, కొత్త ప్రయత్నాల్లో శుభ ఫలితాలు లభించే అవకాశం ఉంది.

Gajakesari Yoga 2026: అరుదైన గజకేసరి యోగం.. వీరికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం
Gajakesari Yoga 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 1:22 PM

Share

స్వక్షేత్రంలో చంద్రుడు, ఉచ్ఛ క్షేత్రంలో గురువు సంచరిస్తున్నారు. కర్కాటక రాశిలో ఈ రెండు గ్రహాలు కలవడం విశేషం. ప్రస్తుతం కర్కాటక రాశిలో గురువు ఒంటరిగా, స్వతంత్రంగా సంచారం చేయడం జరుగుతోంది. అటువంటి గురువుతో చంద్రుడు కలవడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ నెల (సెప్టెంబర్) 7, 8, 9 తేదీల్లో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ మూడు రోజులు అత్యంత శుభ దినాలైనందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి.

మేష రాశి

ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు, చంద్రుల కలయిక విశేష ఫలితాలనిస్తుంది. తప్పకుండా రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. జీవిత పురోగతికి తోడ్పడే ఎటువంటి ప్రయత్నమైనా వీరు ఈ మూడు రోజుల కాలంలో చేపట్టడం మంచిది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవి తం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

మిథున రాశి

ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో చంద్రుడికి యుతి కలగడం వల్ల పూర్తి స్థాయి గజకేసరి యోగం ఏర్పడింది. ఈ రాశివారు ఆదాయ, ఆస్తిపాస్తుల వృద్ధికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడంతో పాటు ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి

ఈ రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో రాశ్యధిపతి చంద్రుడు కలవడం వల్ల ఉన్నత స్థాయి గజకేసరి యోగం ఏర్పడింది. ధన వృద్ధికి, ఉద్యోగ ఉన్నతికి, వృత్తి, వ్యాపారాల మెరుగుదలకు సంబంధించి సరైన ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. వీరికి పట్టిందల్లా బంగారమవుతుంది. జీవితం మంచి మలుపు తిరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

కన్య రాశి

ఈ రాశికి లాభస్థానంలో ఏర్పడ్డ గజకేసరి యోగం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఈ రాశివారు కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపట్టడం మంచిది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి వీలుంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈ మూడు రోజుల కాలం అత్యంత శుభప్రదమైన సమయం. వ్యూహాలు, ప్రణాళికలు తప్పకుండా కొద్ది రోజుల్లో సత్ఫలితాలనిస్తాయి. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి.

వృశ్చిక రాశి

ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో చంద్రుడు కలవడం వల్ల కలలో కూడా ఊహించని రాజయోగాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంట ర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఉన్నతస్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

మకర రాశి

ఈ రాశికి సప్తమంలో ఉచ్ఛలో ఉన్న గురువుతో చంద్రుడు యుతి చెందడం వల్ల గజకేసరి యోగం ఏర్పడింది. దీని వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆదాయపరంగా దూసుకు పోయే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు. రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అన్ని విధాలా ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది.

మీన రాశి

ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువుకు, పంచమాధిపతి చంద్రుడికి పంచమ స్థానంలో యుతి కలుగుతున్నందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఈ మూడు రోజుల కాలంలో కొన్ని లక్ష్యాలను, ఆశయాలను నిర్దేశించుకుని వాటి సాకారానికి కృషి చేయడం మంచిది. ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు.

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య అంచనాలు గ్రహాల ప్రభావాలు, సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాలు ఆధారంగా అందించబడినవి. వీటిని ఖచ్చితమైన భవిష్యవాణిగా లేదా శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలుగా పరిగణించకూడదు)

Follow Us