AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercury Transit 2026: బుధుడికి బలం.. వారికి సింహాసన యోగం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Budha Gochar 2026: సెప్టెంబర్ 7 నుంచి 26 వరకు బుధుడు కన్యా రాశిలో ఉచ్ఛస్థితిలో సంచరిస్తాడు. స్వస్థానంలోనే ఉచ్ఛస్థితిని పొందడంతో బుధుడి బలం మరింత పెరుగుతుంది. దీంతో మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు భద్ర మహాపురుష యోగం ఏర్పడి, ప్రముఖుల స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. అలాగే సింహ, మకర రాశుల వారికి కూడా బుధుడి అనుకూల ప్రభావంతో మహాభాగ్య యోగం కలిసివస్తుంది.

Mercury Transit 2026: బుధుడికి బలం.. వారికి సింహాసన యోగం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Simhasana Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 3:53 PM

Share

ఈ నెల(సెప్టెంబర్) 7 నుంచి 26 వరకు బుధ గ్రహం కన్యా రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం జరుగుతుంది. కన్యా రాశి బుధుడికి స్వస్థానం. తన స్వస్థానంలోకి, అందులోనూ ఉచ్ఛస్థితిలోకి ప్రవేశించడం వల్ల బుధుడికి విపరీతంగా బలం పెరుగుతుంది. కన్యారాశి కేంద్రంగా ఉన్న రాశులకు దీనివల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడుతుంది. భద్ర మహా పురుష యోగం అంటే వి.ఐ.పి యోగం. దీన్నే సింహాసన యోగమని కూడా అంటారు. అంటే, మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశుల వారు ప్రముఖుల స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఉచ్ఛ స్థితిలో ఉన్న బుధుడి అనుకూలత వల్ల సింహ, మకర రాశుల వారికి కూడా మహా భాగ్య యోగం పట్టడం జరుగుతుంది.

మిథునం

ఈ రాశికి చతుర్థ కేంద్రమైన కన్యారాశిలో బుధుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి భద్ర మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలకు విపరీతంగా డిమాండ్ పెరిగి, రాబడి ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. సామాజికంగా ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. షేర్లతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరిగి స్థిరత్వం ఏర్పడుతుంది.

సింహం

ఈ రాశికి ధన, లాభాధిపతిగా బుధుడు తన స్వస్థానంలో ప్రవేశించడం వల్ల సిరిసంపదలు విప రీతంగా పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో జీతభత్యాలు ఆశించిన దానికంటే బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకే తప్ప నష్టాలకు అవకాశం ఉండదు. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడ తాయి. లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగుతుంది.

ఇవి కూడా చదవండి

కన్య

ఈ రాశిలో బుధుడి స్వస్థాన, ఉచ్ఛ స్థిత సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఈ రాశివారు ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. షేర్లతో సహా అనేక విధాలా ఆదాయం పెరుగుతుంది. ఒక సంపన్న వ్యక్తిగా గుర్తింపు పొందడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖుడి స్థాయికి ఎదుగుతారు.

ధనుస్సు

ఈ రాశికి దశమ కేంద్రంలో బుధుడి స్వస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. కలలో కూడా ఊహించని విధంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది. ప్రేమ జీవితం ప్రారంభమవుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవు తాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

మకరం

ఈ రాశికి భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల మహాభాగ్య యోగం, లక్ష్మీ కటాక్ష యోగం ఏర్పడ్డాయి. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు అంచనాలకు మించిన జీతభత్యాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా మంచి ఆఫర్లు అందుతాయి.

మీనం

ఈ రాశికి సప్తమ కేంద్రంలో బుధుడి స్వస్థాన సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్ప డింది. ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

Follow Us