AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి నిద్రపోయే ముందు ఈ 2 పనులు చేయండి.. మీ జుట్టు ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి!

నేటి బిజీ లైఫ్‌స్టైల్, కాలుష్యం, ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం, పలచబడటం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. అయితే, ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా, ఇంట్లోనే కొన్ని సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా జుట్టును పొడవుగా, ఒత్తుగా మార్చుకోవచ్చు. ప్రముఖ యోగా నిపుణురాలు, ఆయుర్వేద ప్రాక్టీషనర్ ఖుషీ బాజ్పా దీని కోసం రాత్రి పడుకునే ముందు పాటించాల్సిన 2 సింపుల్ స్టెప్స్ రొటీన్‌ను పంచుకున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి, జుట్టు వేగంగా పెరగడానికి ఎంతో సహాయపడుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు ఈ 2 పనులు చేయండి.. మీ జుట్టు ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి!
How To Reduce Hair Fall
Jyothi Gadda
|

Updated on: Sep 07, 2026 | 3:17 PM

Share

అందమైన, పొడవైన, ఒత్తైన జుట్టును కోరుకోని వారు ఉండరు. కానీ, మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, కాలుష్యం కారణంగా చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే రసాయనాలు కలిగిన ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే ప్రముఖ యోగా ఎక్స్‌పర్ట్, ఆయుర్వేద ప్రాక్టీషనర్ ఖుషీ బాజ్పా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పాటించాల్సిన ఒక సింపుల్ అండ్ నైట్-టైమ్ హెయిర్ కేర్ రొటీన్‌ను సూచించారు. ఈ 2 సులభమైన అలవాట్లను మీ దినచర్యలో చేర్చుకుంటే జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుదల వేగవంతమవుతుంది.

వెదురు బ్రష్‌తో తలను ముందుకు దించి మసాజ్ చేయడం: రాత్రి నిద్రపోయే ముందు మీ జుట్టును ముందు వైపునకు కిందికి వేలాడదీయాలి. ఆ తర్వాత ఒక వెదురుతో చేసిన బ్రష్ తీసుకుని, తల చర్మం పై మెల్లగా దువ్వుతూ మృదువుగా మసాజ్ చేయాలి.

ఇది ఎలా పనిచేస్తుంది? తలను ముందుకు దించడం వల్ల తలభాగంలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. రక్తప్రసరణ బాగా జరగడం వల్ల కుదుళ్లకు తగినంత పోషకాలు అందుతాయి. వెదురు బ్రష్ ఉపయోగించడం వల్ల స్కాల్ప్ రిలాక్స్ అయ్యి, హెయిర్ ఫోలికల్స్ ఉత్తేజితమై జుట్టు వేగంగా పెరగడానికి దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి

మర్మ పాయింట్స్ మసాజ్: రెండవ ముఖ్యమైన స్టెప్.. రాత్రి నిద్రపోయే ముందు తలపై ఉండే ప్రధానమైన మర్మ పాయింట్లను మీ వేలి కొనలతో తేలికపాటి ఒత్తిడి ఇస్తూ మసాజ్ చేయడం.

దీని ప్రయోజనాలు: ఆయుర్వేదం ప్రకారం మర్మ పాయింట్లను మసాజ్ చేయడం వల్ల శరీరంలో శక్తి ప్రవాహం మెరుగవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని, అలసటను తక్షణమే తగ్గిస్తుంది. ఒత్తిడి అనేది జుట్టు రాలడానికి ప్రధాన కారణం కాబట్టి, ఇది తగ్గడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. అంతేకాకుండా, ఈ మసాజ్ వల్ల రాత్రి పూట ప్రశాంతమైన, మంచి నిద్ర పడుతుంది.

జుట్టు ఆరోగ్యం అనేది మనం తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి ఖర్చు లేని ఈ 2-స్టెప్ యోగా రొటీన్‌ను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా జుట్టు రాలడం తగ్గడమే కాకుండా, కుదుళ్లు దృఢంగా మారి జుట్టు సహజమైన మెరుపుతో పెరుగుతుంది. కాబట్టి, నేటి నుంచే రాత్రి పడుకునే ముందు ఈ చిన్న చిట్కాలను పాటించడం ప్రారంభించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us