మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ .. ఫోటోలు అదుర్స్ 

7 September  2026

Rajeev 

Pic credit - Instagram

అందాల భామ బాంధవి శ్రీధర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ చిన్నది 2022లో విడుదలైన "మసూద" అనే సినిమాలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో ఆమె దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో నటించింది. 

తన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా బాంధవి శ్రీధర్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

దాంతో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. బాంధవి శ్రీధర్ హీరోయిన్‌గా అడుగుపెట్టడానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది.

ఆమె "మిస్టర్ పర్‌ఫెక్ట్", "రభస", "మొగుడు", "రామయ్య వస్తావయ్య", "మజ్ను" వంటి తెలుగు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. .

కాగా "మసూద" సినిమాతోనే ఆమెకు హీరోయిన్‌గా పెద్ద బ్రేక్ లభించింది. అంతేకాకుండా, బాంధవి శ్రీధర్ అందాల పోటీల్లో కూడా విజయం సాధించింది.  

ఇటీవలే పెద్ది సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ పాత్రలో మెరిసింది. కానీ ఆమె పాత్ర థియేటర్స్ లో కట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ కవ్విస్తుంది.