CM Chandrababu: పంట, ఆస్తి నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పంట పొలాలు నాశనం అయ్యాయి. రోడ్లు , రైల్వే ట్రాక్‌లు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం తుఫాన్ ప్రభావిత జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి తర్వాత.. స్వయంగా పొలాల దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడారు. ఇందులో భాగంగానే గురువారం తుఫాన్ ప్రభావ పరిస్థితి, పంట, ఆస్తి నష్టం పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

మొంథా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. పంట పొలాలు నాశనం అయ్యాయి. రోడ్లు , రైల్వే ట్రాక్‌లు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో బుధవారం తుఫాన్ ప్రభావిత జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి తర్వాత.. స్వయంగా పొలాల దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడారు.
అధికారులతో చంద్రబాబు సమీక్ష
ఇందులో భాగంగానే గురువారం తుఫాన్ ప్రభావ పరిస్థితి, పంట, ఆస్తి నష్టం పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటు, ఆస్తి నష్టంపై అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం పై ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు ఆయన తెలిపారు. వరి, మొక్కజొన్న, పత్తి. అరటి, ఇతర ఉద్యాన వన పంటలు బాగా దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. అయితే ఐదు రోజుల్లోగా పంట నష్టం పూర్తి నివేదిక అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పర్యటన
మరోవైపు మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. అవనిగడ్డ నియోయకవర్గం కోడూరు దగ్గర తుపాను మూలంగా దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకొని ధైర్యం చెప్పారు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
