తల్లిని వేధిస్తున్నాడని బాబాయిని చంపేసిన అబ్బాయి.. చివరికీ తానే స్వయంగా..
Alluri Sitharama Raju district: హత్య చేసాక తనే భయపడి వెళ్లి లొంగిపోవడంతో అసలు విషయం తెలిసి అంతా కంగుతిన్నారు. సొంత చిన్నాన్ననే కొడుకు కాటికి పంపేసాడు. ఎందుకంటే..? అల్లూరి జిల్లాలో ఈ దారుణం జరిగింది.. సాకేరి బాలరాజు అనే వ్యక్తి ని హత్య చేశాడు కొడుకు వరసైనా లోవరాజు. హత్య చేసి బాబాయి మృతదేహాన్ని పూడ్చి..
అల్లూరి జిల్లా, ఆగస్టు 5: ఆ గిరిజనుడు ఒక్కసారిగా కనిపించడం మానేశాడు. ఎక్కడి కెళ్ళాడో.. ఏమయ్యాడో అని అంతా అనుకుంటున్నారు. అంతలోనే ఆ వార్త విని అంతా గుండెలు పట్టుకున్నారు. శవంగా మారి మట్టిలో ఉన్నాడన్న సంగతి తెలిసి అంతా అవాక్కయ్యారు. హత్య చేసాక తనే భయపడి వెళ్లి లొంగిపోవడంతో అసలు విషయం తెలిసి అంతా కంగుతిన్నారు. సొంత చిన్నాన్ననే కొడుకు కాటికి పంపేసాడు. ఎందుకంటే..? అల్లూరి జిల్లాలో ఈ దారుణం జరిగింది.. సాకేరి బాలరాజు అనే వ్యక్తి ని హత్య చేశాడు కొడుకు వరసైనా లోవరాజు. హత్య చేసి బాబాయి మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు నిందితుడు. చింతపల్లి మండలం బూసులుకోట గ్రామంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ బుసలకోట గ్రామనికి చెందిన సాకేరి బాలరాజు నివాసముంటున్నాడు. సాకేర్ బాలరాజు అన్న కొన్నళ్ల క్రితం మృతి చెందాడు. బాలరాజు భార్య కూడా కొంత కాలం క్రితం మృతి చెందింది. దీంతో తన సొంత అన్న భార్య అయిన వదినతో సన్నిహితం పెంచుకున్నాడు బాలరాజు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అన్న కుటుంబం, తన కుంటుంబం అంతా కలిసే ఉంటున్నారు. అయితే బాలరాజు తన సొంత వదినతో సహజీవనం చేయడం, మద్యం సేవించి ఆమెను తరచూ తిడుతూ కొడుతూ ఉండేవాడు.. హింసించేవాడు. ఆమె కొడుకు లోవరాజును కూడా బాలరాజు హింసించేవాడు.
ఇదిలా సాగుతుండగానే ఈ నెల 2వ తేదీన బుసలు కోట గ్రామం శివారులో లోవరాజు, అతని తల్లితో కలిసి వ్యవసాయ పనులు చేస్తుండగా బాలరాజు అక్కడకు వెళ్లాడు. బాలరాజు కూడా అక్కడే ఒక పొలం ఉంది. ఆ పొలంలోని ఆకుమడిని లోవరాజుకు చెందిన పశువులు మేసాయి. అందుకు బాలరాజు కోపంతో.. మద్యం మత్తులో అక్కడకు వెళ్లి లోవరాజు, అతని తల్లిని తిట్టడం ప్రారంభించాడు.. లోవరాజు సముదాయించినా అతనిపైన కూడా చేయి చేసుకున్నాడు. అంతేకాదు.. లోవరాజు తల్లిపై బాలరాజు చేయి చేసుకున్నాడు. తన తల్లిని వేధించడం చూసి లోవరాజు భరించలేక ఎప్పటినుంచో ఓర్చుకుంటూ వచ్చాడు. ఇంకా ఎప్పటినుంచో పగ పెంచుకొని అతని చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అయితే.. బాలరాజు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పాటు మళ్లీ తిట్టడం, గొడవ పడడంతో లోవరాజు కోపం కట్టలు తెంచుకుంది. తన వద్ద ఉన్న కత్తితో బాలరాజు మెడ, ఛాతిపై దాడి చేశాడు లోవరాజు. అలా పొంత చిన్నాన్నానే చంపేసాడు.
చిన్నాన్న శవాన్ని అక్కడే పాతిపెట్టాడు..
హత్య చేశాక గ్రామంలో తెలిసి పోతుందన్న భయంతో.. ఆ మృత దేహాన్ని అక్కడే పొలానికి సమీపంలో గోయి తీసి పూడ్చి పెట్టాడు. తరువాత ఇంటికి వచ్చిన లోవరాజు.. భయంతో ఉక్కిరిబిక్కిరైయ్యాడు. ఆ తరువాత తానే విఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఆ తరువాత పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు అధికారులు. ఈ మేరకు లోవరాజును అరెస్ట్ చేశామని స్థానిక సిఐ రమేష్ తెలిపారు