ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే కాదు… అమరుల సంస్మరణ దినోత్సవం…

గత ఏడాది తాను ఒంగోలు నుంచి ఢీల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టి అక్కడ ఇండియా గేట్‌ దగ్గర ఫిబ్రవరి 14న అమరులైన భారత వీర జవాన్లకు నివాళులు అర్పించినట్టు తెలిపారు... ఈ ఏడాది కూడా ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్టు చెబుతున్నారు... ఈరోజు నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఫిబ్రవరి 14 నాటికి కన్యాకుమారికి చేరుకుంటుందని, అక్కడ ఉన్న

ఫిబ్రవరి 14 వాలంటైన్స్‌ డే కాదు... అమరుల సంస్మరణ దినోత్సవం...
Cycle Trip
Follow us
Fairoz Baig

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 06, 2024 | 12:25 PM

ప్రపంచమంతా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే జరుపుకుంటుంటే మన దేశంలో మాత్రం ఆరోజు బ్లాక్‌డేగా పరిగణిస్తారు… కారణం 2019 ఫిబ్రవరి 14న జమ్ములోని శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత జవాన్లపై దాడి జరగడమే… ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మరణించిన సైనికుల గౌరవార్దం ఆరోజు అమరవీరులను సంస్మరించుకుంటున్నారు… భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు… దీంతో ఫిబ్రవరి 14న భారత అమరవీరులకు నివాళులు అర్పిస్తూ దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రజలు సైనికులను స్మరించుకుంటున్నారు… అందులో భాగంగా…

ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌ డే బదులుగా అమరులైన జవాన్ల సంస్మరణ దినంగా పాటించాలని కోరుతూ ఒంగోలుకు చెందిన యువకుడు కీర్తినాయుడు ప్రతియేటా సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్నాడు… ఈ ఏడాది ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభించాడు… ఫిబ్రవరి 14 నాటికి కన్యాకుమారికి చేరుకుని అక్కడ భారత అమరవీర జవాన్లకు నివాళులు అర్పించేందుకు బయలుదేరి వెళ్ళాడు… 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన భారత జవాన్ల గౌరవార్ధం ఈ యాత్రలు చేస్తున్నట్టు కీర్తి నాయుడు తెలిపారు..

గత ఏడాది తాను ఒంగోలు నుంచి ఢీల్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టి అక్కడ ఇండియా గేట్‌ దగ్గర ఫిబ్రవరి 14న అమరులైన భారత వీర జవాన్లకు నివాళులు అర్పించినట్టు తెలిపారు… ఈ ఏడాది కూడా ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్టు చెబుతున్నారు… ఈరోజు నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర ఫిబ్రవరి 14 నాటికి కన్యాకుమారికి చేరుకుంటుందని, అక్కడ ఉన్న స్థానికులతో కలిసి అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించనున్నట్టు తెలిపారు… ఆ రోజుల ప్రతి భారతీయుడు పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకోసం కొద్దిసేపు మౌనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..