Kadapa: స్నేహం కోసం ప్రాణం ఇస్తానంటూ యువకుడు మృతి.. మద్యం మత్తులో తొడపై కోసుకొని..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 14, 2023 | 12:38 PM

Kadapa District: ఇబ్రహీం అనే వ్యక్తి మద్యం మత్తులో ఉండి స్నేహితుల కోసం ప్రాణాలు ఇస్తానంటూ కాలు దగ్గర కత్తితో కోసుకున్నాడు. ఇలా అయిన కత్తి గాయం కారణంగా కాలి నుంచి పెద్ద మొత్తంలో రక్తస్రావం కావడంతో ఇబ్రహీం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మృతి చెందిన ఇబ్రహీం కడప నగరంలోని నకష్‌కు చెందిన వ్యక్తి అని, అతనిపై గతంలో పలు కేసులు నమోదైయ్యాయని పోలీసులు గుర్తించారు. పలు కేసులలో నిందితుడు అయిన ఇబ్రహీం మరణించడంతో అతని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి..

Kadapa: స్నేహం కోసం ప్రాణం ఇస్తానంటూ యువకుడు మృతి.. మద్యం మత్తులో తొడపై కోసుకొని..
Ibrahim
Follow us on

కడప, ఆగస్టు 13: స్నేహం కోసం ప్రాణమిస్తానని చెప్పే వ్యక్తులు మన చుట్టూ ఎందరో ఉంటారు. సరదాగా ఫ్రెండ్ ఎవరైనా ప్రాణం ఇవ్వురా అని అంటే.. ఏదో మాట వరసకు అన్నాడేమోలే అని వదిలేస్తాం. కానీ కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం తన స్నేహితుల కోసం ప్రాణాలు ఇస్తా అంటూ మద్యం మత్తులో అవేశానికి లోనై నిజంగానే తన ప్రాణాలు కోల్పోయాడు. కడప నగరంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీం అనే వ్యక్తి మద్యం మత్తులో ఉండి స్నేహితుల కోసం ప్రాణాలు ఇస్తానంటూ కాలు దగ్గర కత్తితో కోసుకున్నాడు.

అయితే కత్తి గాయం కారణంగా కాలి నుంచి పెద్ద మొత్తంలో రక్తస్రావం కావడంతో ఇబ్రహీం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మృతి చెందిన ఇబ్రహీం కడప నగరంలోని నకష్‌కు చెందిన వ్యక్తి అని, అతనిపై గతంలో పలు కేసులు నమోదైయ్యాయని పోలీసులు గుర్తించారు. పలు కేసులలో నిందితుడు అయిన ఇబ్రహీం మరణించడంతో అతని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

అయితే మద్యం సేవించే సమయంలో స్నేహితుల మద్య మాటా మాట పెరగడం , స్నేహానికి తాను ఎంతో విలువ ఇస్తానని, స్నేహితుల కోసం ప్రాణాలు ఇస్తానని ఇబ్రహీం ఆవేశానికి లోనై తన కాలుని కత్తతో కోసుకున్నాడని, అలా చేయడంతో రక్త స్రావం బాగా జరిగి అతను ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. అర్దరాత్రి సమయంలో ఈ సంఘటన జరగడంతో ఇది తననంతట తాను కోసుకున్నాడా లేక స్నేహితులతో మరేదైనా ఇష్యూ జరిగిందా అనే కోణంలో కూడా కడప పోలీసులు ఇబ్రహీం మిత్రులను ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సంఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..