Anantapur: లో దుస్తుల రంగు ఏంటో చెప్పాలంటున్న లైబ్రేరియన్‌‌ను వాయగొట్టిన పేరెంట్స్

Anantapur: లో దుస్తుల రంగు ఏంటో చెప్పాలంటున్న లైబ్రేరియన్‌‌ను వాయగొట్టిన పేరెంట్స్

Ram Naramaneni

|

Updated on: Aug 14, 2023 | 12:05 PM

లైబ్రేరీకి వెళ్లాలంటేనే భయం వేస్తుందని విద్యార్థినిలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి స్కూల్ వద్దకు చేరుకున్నారు. లైబ్రేరియన్‌ను చితక బాదారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల్లో దెబ్బలు తింటున్న లైబ్రేరియన్‌ను పోలీసులు రక్షించి స్టేషన్‌కు తరలించారు.లైబ్రేరియన్‌పై కంప్లైంట్‌ ఫైల్‌ చేశారు పేరెంట్స్‌..పిల్లలతో ఇలాగే ప్రవర్తించేది అంటూ మండిపడుతున్నారు. అయితే తాను ఎవరినీ వేధించలేదని లైబ్రేరియన్ చెప్తున్నారు. తనపై గత ప్రిన్సిపాల్ ఇలాంటి అలిగేషన్స్ చేయిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. 

స్కూల్స్‌లో కూడా చిన్నారులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు..ఇలాంటి దారుణ ఘటన ఒకటి అనంతపురం జిల్లా కేంద్రీయ విద్యాలయ స్కూల్‌లో వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కేంద్రీయ విద్యాలయ స్కూల్‌లో లైబ్రేరియన్‌ విద్యార్థినులను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పేరెంట్స్ ఆయనను చితకబాదారు. లైబ్రేరియన్ ఫీమేల్ స్టూడెంట్స్‌ను తాకుతూ అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నాడని.. విద్యార్ధినిల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పుస్తకాలయానికి వెళ్లిన విద్యార్థినిలను దగ్గరకు పిలిపించుకుని లోపల వేసుకున్న లో దుస్తుల రంగు ఏంటో చెప్పాలని అడుగుతున్నాడని అంతేకాకుండా మసాజ్ చెయ్యాలని వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద వాపోయారు.

Published on: Aug 14, 2023 12:05 PM