Andhra Pradesh: నువ్వు మనిషివేనా..? ఆస్తికోసం అక్క కొడుకును ఏం చేశాడంటే..

అభం, శుభం తెలియని 8వ తరగతి బాలుడిని అత్యంత కర్కశంగా హత్య చేశాడు ఆ కసాయి. ఆస్తిలో సోదరికి వాటా ఇవ్వాల్సి వస్తుందని బాలుడిని చంపాడు సరే.. మరి హత్యకు మూల్యం చెల్లించాలన్న సంగతి మర్చిపోయినట్టు ఉన్నాడు. ఏం తెలియనట్లు నటించాడు.. చివరకు..

Andhra Pradesh: నువ్వు మనిషివేనా..? ఆస్తికోసం అక్క కొడుకును ఏం చేశాడంటే..
Crime News
Follow us
Nalluri Naresh

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 29, 2024 | 9:14 PM

అభం, శుభం తెలియని 8వ తరగతి బాలుడిని అత్యంత కర్కశంగా హత్య చేశాడు ఆ కసాయి. ఆస్తిలో సోదరికి వాటా ఇవ్వాల్సి వస్తుందని బాలుడిని చంపాడు సరే.. మరి హత్యకు మూల్యం చెల్లించాలన్న సంగతి మర్చిపోయినట్టు ఉన్నాడు. ఏం తెలియనట్లు నటించాడు.. చివరకు.. సీసీ కెమెరాలు చెక్ చేయడంతో.. దుర్మార్గుడి అసలు రూపం బయటపడింది.. హత్య జరిగిన 12గంటల్లోపే కటకటాల వెనక్కు వెళ్ళాడు. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం.. అసలేం జరిగిందంటే..

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో జరిగిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది ఉన్నత పాఠశాల వద్ద 8వ తరగతి విద్యార్థి చేతన్ అనే విద్యార్థిని గురువారం రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు బైక్ లో తీసుకెళ్లారు. అయితే, ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. ఇంతలో చేతన్ తాత వచ్చి పాఠశాల వద్ద ఆరా తీయగా ఎవరో పాఠశాల ఇంటర్వెల్ టైంలో స్కూల్ బయట చేతను బైక్‌పై తీసుకువెళ్లినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడు చేతన్ తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడు చేతన్ మిస్సింగ్ పై.. రంగంలోకి దిగిన పోలీసులు వేట ప్రారంభించారు. సరిగ్గా 12గంటల్లోపే బాలుడు ఎక్కడ ఉన్నాడన్నది గుర్తించారు. కానీ ఆ బాలుడు అత్యంత దారుణంగా హత్యకు గురై శవంగా కనిపించాడు.

అసలు 12ఏళ్ల వయసున్న బాలుడిని ఎందుకు చంపారు.. అంత అవసరం ఏమోచ్చిందంటే…

మరువపల్లి గ్రామానికి చెందిన పుష్పవతి, వెంకటస్వామి దంపతులు కుమారుడు చేతన్. పుష్పవతి గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఆమె తల్లిదండ్రులతో ఉంటోంది. వారికి చేతన్ ఒక్కడే కుమారుడు. ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటి లానే గురువారం కూడా స్కూల్ వెళ్లాడు. అదే తన తల్లిని, అవ్వ తాతలను చూడటం చివరి సారి అవుతుందని ఊహించలేకపోయాడు. పాఠశాలలో ఇంటర్వెల్ సమయంలో ఆడుకునేందుకు బయటకు వచ్చాడు. అదే సమయంలో చేతన్ మేనమామ అశోక్ అనే వ్యక్తి అటుగా వచ్చాడు. అల్లుడు అంటూ పలుకరించాడు. మామలో ఉన్న విషాన్ని గుర్తించలేక ఆ బాలుడు దగ్గరకు వెళ్లాడు. వెంటనే ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సరిగ్గా పన్నెండున్నర సమయంలో చేతన్ తాతకు ఒక ఫోన్ కాల్ వచ్చంది. నీ మనవడు ఎక్కడున్నాడో తెలుసా అని.. పాఠశాలకు వెళ్లాడని చెప్పాగానే.. అసలు అక్కడ ఉన్నాడో? లేదో? చూసుకో అని అవతలి వైపు నుంచి వాయిస్ వచ్చింది.

దీంతో హుటాహుటిన స్కూల్ వద్దకు వెళ్లగా.. చేతన్ కనిపించలేదు. వెంటనే ఉపాధ్యాయులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మూడు బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా ద్విచక్రవాహనంలో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. ఆ దిశగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ కిడ్నాప్ చేసిన వ్యక్తుల లొకేషన్ కనిపెట్టారు. మడకశిర మండలానికి సరిహద్దున ఉన్న కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో సిగ్నల్ వచ్చిందని గుర్తించారు. ఆ ప్రాంతంలో గాలించగా.. బాలుడు శవమై కనిపించాడు. చేతన్ ని మేనమామ అశోక్ చేతులు, కాళ్లు చేతులు కట్టివేసి, నోటిలో గుడ్డలు కుక్కి పొదల్లోకి లాక్కెళ్ళి యాక్సా బ్లేడ్ తో గొంతు కోసి హత మార్చినట్టు గుర్తించారు పోలీసులు.. నిందితుడు అశోక్ పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..