AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్‌

తిడితే పడివుండడానికి ఇవి ఎనకటి రోజులు కావు. తిరగబడే రోజులు కూడా క్రాస్‌ అయిపోయాయి. మాటల్లేవ్‌..మాట్లాడుకోవడాల్లేవ్‌. తేడా వస్తే డైరెక్ట్‌ ఇప్పుడు అటాకే . ఓ శ్రీమతి కోపం పతికి ప్రాణాలపైకి వచ్చింది.అతన్ని ఫినిష్‌ చేసి దృశ్యం సినిమా తరహాలో కేసును తప్పుదో వ పట్టిద్దామనుకున్నారు. కానీ భూమ్మీద నూకలు ఉండడంతో బావిలో నుంచి బయటపడ్డాడు.నిజం వెలుగుచూసింది.

Krishna District: బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..  పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్‌
Prasad Usharani
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2025 | 6:58 PM

Share

మచిలీపట్నం కాలేఖాన్ పేటలో ప్రసాద్‌ కుటుంబం అంటే అన్యోన్యతకు మారుపేరు. ప్రసాద్‌, ఆయన భార్య ఉషారాణి.. ఇద్దరు పిల్లలు… ఉన్నంతలో ఆనందంగా ఉండేవాళ్లు. రాత్రి వరకు అందరితో బాగాఉన్నా ప్రసాద్‌.. తెల్లారే సరికి రక్తం మడుగులో పడివున్నాడు. ఉషారాణి, ఆమె పిల్లల దు:ఖం కట్టలు తెగింది. తీవ్రగాయలపాలైన ప్రసాద్‌ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందని ఆరా తీస్తే… ఉషారాణి కన్నీరు పెడుతూ క్రైమకథ చెప్పింది. నలుగురైదుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి.. అతనిపై దాడి చేశారని. అడ్డుకోబోయిన తనను కూడా కట్టారని సినిమా సీన్‌ను కళ్లకు కట్టిందామె. ఔనూ..ఔనౌను అంటూ కొడుకు, కూతురు కూడా తల్లికి వంత పడ్డారు. అయ్యో పాపం అని జాలి పడ్డారంతా. ఇంకా నయం మీరు అడ్డుపడ్డారు కాబట్టీ సరిపోయింది..లేదంటే ఆ దుర్మార్గులు ప్రసాద్‌ను చంపేసి ఉండేవాళ్లన్నారు. కదా..అతని కళ్లు ఒత్తుకున్నారు ఉషారాణి, ఆమె పిల్లలు. జనం వాళ్లను మాటలను నమ్మారాని.. ప్లాన్‌ వర్కవుటయిందని సంతోషించారు. ప్రసాద్‌ బతికి బట్టకట్టే ప్రసక్తేలేదు.. రేపోమాపో శాల్తీ గల్లంతవడం ఖాయమనుకున్నారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. ప్రసాద్‌ ఇంటి వైపు దుండగులు వచ్చిన ఆనవాళ్లు కన్పించలేదు. మరోసారి ఉషాను ఆమె పిల్లలను ప్రశ్నించారు పోలీసులు. ఖాకీలకు కూడా దృశ్యం సినిమా చూపించారు వాళ్లు. ఎవరో వచ్చారు కొట్టారు…అడ్డుకున్నాం..పారిపోయారు.. జరిగింది ఇదేనంటూ లైన్‌ లెంగ్త్‌ తప్పకుండా ముగ్గురూ సేమ్‌ స్టోరీ చెప్పారు. వాళ్లు చెప్పింది వింటే నిజమేనన్పిస్తుంది.కానీ టెక్నికల్‌గా ఎలాంటి ఆధారాల్లేవు. పోనీ ప్రసాద్‌కు ఎవరైనా శత్రువులు వున్నారా ఆని ఆరా తీస్తే అలాంటి దాఖల్లేవు. అందరిదో అతను మంచిగా వుండేవాడని తెలిసింది. ఈ కేసు ఖాకీలకు ఓ సవాల్‌గా మారింది.

ఈలోపు ప్రసాద్‌ కోలుకోవడంతో అసలు కత తెరపైకి వచ్చింది.తన భార్య, కొడుకు, బిడ్డ ముగ్గురు కలిసి తనను చంపాలని చూశారన్న అతని మాటలతో అంతా షాకయ్యారు. ఎందుకని.. కూపీలాగితే విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రసాద్‌ …ఎప్పుడూ భార్యను తిడుతూ ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకు సైతం సూటిపోటీ మాటలనేవాడని ఉషారాణి కుమిలిపోయేది. కొడుకు బిటెక్‌ చదువుతున్నాడు. కూతురు హై స్కూల్‌. ఎదిగిన బిడ్డలకు తన బాధను చెప్పుకునేదామె. తండ్రితో కన్నా అమ్మతోనే వాళ్లకు అటాచ్‌మెంట్‌ ఎక్కువ. తల్లిని బాధ పెడుతున్నాడని తండ్రిపై కోపం పెంచుకున్నారు. ముగ్గురు కలిసి ప్రసాద్‌ను ఫినిష్‌ చేయాలని ప్లానేశారు. ప్రసాద్‌ గాఢనిద్రలో ఉన్న టైమ్‌ చూసి అతని కాళ్లు చేతులు కట్టేసి దాడి చేశాడు.అతను స్పృహ కోల్పోవడంతో చనిపోయాడని భావించారు.తీసుకెళ్లి బావిలో పడేశారు. ఆ కుదుపుకు మెలకువలోకి వచ్చిన ఆయన కాపాడమని కేకలు వేశాడు. ఇరుగు పొరుగు వింటే మొదటికే మోసమని.. బావిలోనే అతన్ని ఖతం చేసేందుకు పైనుంచి రాళ్లు విసిరారు. అతను బాధతో మరింగ బిగ్గరగా అరిచాడు. అతను పైకి వచ్చేలా బావిలోకి నిచ్చెన వేశారు. పైకి రాగానే అతనిపై మళ్లీ దాడి చేశారు. ప్రసాద్‌ చలనం లేకుండా పడిపోవడంతో..ఫినిష్‌ అయిడానుకున్నారు. దుండగులొచ్చి కొట్టి చంపారని బంధువులకు చెప్పారు. కానీ కొనవూపిరితో వున్నాడని గమనించిన స్థానికులు అతన్ని హాస్పిటల్‌కు తరలించడం.అతను కోలుకోవడంతో అసలు నిజం వెలుగుచూసింది. ఉషారాణి సహా కుమారుడిని అరెస్ట్‌ చేసి కటకటాలబాటపట్టించారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.